నాలుగేళ్ల వయసుకే రచయిత్రిగా..ఏకంగా రెండు గిన్నిస్‌ రికార్డులు! | Bhubaneswar girl holds 2 Guinness World Records Goes Viral | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల వయసుకే రచయిత్రిగా..ఏకంగా రెండు గిన్నిస్‌ రికార్డులు!

Aug 30 2026 1:38 PM | Updated on Aug 30 2026 1:38 PM

Bhubaneswar girl holds 2 Guinness World Records Goes Viral

వచ్చిరాని ముద్దుముద్దు మాటలతో అలరించే వయసుకే పుస్తకం రాసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా భావోద్వేగాలు అంటే అర్థాకానీ వయసుకే దానిపైనే పుస్తకం రాసి గిన్నిస్‌ రికార్డు దక్కించుకుంది. ఏకంగా రెండు రికార్డులు నెలకొల్పడం విశేషం. ఎవరా చిచ్చరపిడుగు అంటే..

ఆ చిన్నారే భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్‌ అగర్వాల్‌. చాలామంది పిల్లలు తాము ఏం అనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేసే వయసులోనే తన సొంత భావోద్వేగాలపై పుసక్తం రాసేసింది ఈ చిచ్చరపిడుగు. పైగా రెండు భాషాల్లో పుస్తకాన్ని రాసిన అతిపిన్న వయస్కురాలైన చిన్నారిగా నిలిచింది. దాన్ని ఆ చిన్నారి ఆంగ్ల, స్పానిస్‌ భాషల్లో రాయడం విశేషం. 

ఆ చిన్నారి ‘లిటిల్ గర్ల్, బిగ్ ఎమోషన్స్’  అనే పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో పడిన ఇబ్బందిని పూసగుచ్చినట్లు రాసుకొచ్చింది. అంతేగాదు ఆమె తన భావోద్వేగాలను విస్పోటనం చెందే అగ్నిపర్వతంగా అభివర్ణించి తన వయసుకి మించి సృజనాత్మకతతో ఆకట్టుకుందామె. తనలాంటి భావోద్వేగాలను అనుభవిస్తున్న పిల్లల కోసం ఈ పుస్తకం రాసిందట. అందుకుగాను గిన్నిస్‌ రికార్డు సొంత చేసుకోవడమే కాదు. అతిపిన్నవయస్కురాలైన టెడ్‌ఎక్స్‌ స్పీకర్‌గా మరో గిన్నిస్‌ రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నారి. 

ఈ పుస్తకంలో కేవలం రాయడం మాత్రమే కాదు స్వయంగా తనే చిత్రాలను కూడా గీసింది. చిత్ర లేఖనం, సృజనాత్మకతతో తనలో రెండు కళలను ఒకేసారి పుస్తక రూపంలో చూపించింది. అంతేకాదండోయ్‌ రెండేళ్ల వయసులోనే 72కి పైగా చిత్రాలను గీసిందట. ఆమె కళాకృతులు ముంబై, గురుగ్రామ్, దుబాయ్‌లో ప్రదర్శించారట కూడా. అంతేగాదు ఆ చిట్టితల్లిని  చిన్న ఏజ్‌లోనే రెండు గిన్నిస్‌ రికార్డులు దక్కించుకోవడం ఎలా ఉంది అని అడిగితే..ఒకేసారి రెండు ఐస్‌క్రీంలు తిన్నంత తియ్యగా ఉందని చెబుతుండటం విశేషం.

(చదవండి: బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్‌ వెయిట్‌లాస్‌ జర్నీ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement