ఒక వ్యక్తి ఏక్ నిరంజన్‌లా ఒంటరిగా ఒక్కడే ఉండేవాడు ఆ దీవిలో. అలా ఏకాంతంగా ఒకటో రెండో ఏళ్లు కాదు ఏకంగా 16 ఏళ్లు ఒంటిరిగా జీవించాడు. కానీ అతడి అనూహ్య నిష్క్రమణ ఒక్కసారిగా ..ఆ ప్రాంతానికి అంతర్జాతీయ దృష్టిపడేలా గుర్తింపు రావడమే గాక దాని సంరక్షక బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం. ఆ ఒక్కడి ఒంటరి జీవనం గుర్తింపుకి ఎలా దారితీసిందంటే..
న్యూజిలాండ్‌కి చెందిన టామ్ నీల్ అనే నేవికుడు రారోటోంగాకు ఉత్తరాన సుమారు 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పగడపు అటాల్, సువారోలో ఏకాంతంగా నివశించాడు. 1902లో వెల్లింగ్‌టన్‌లో జన్మించిన నీల్ రాయల్ న్యూజిలాండ్ నేవీవలో చేరారు. అయితే పసిఫిక్ చుట్టూ స్వతంత్రంగా ప్రయాణించే నిమిత్తం తన కాంట్రాక్టుని రద్దు చేసుకున్నాడు. తదనంతరం అనేక ద్వీపాలలో వ్యాపారిగా, దుకాణదారుడుగా పనిచేశారు.
అయితే ఒక అమెరికన్ రచయిత రాబర్ట్ డీన్ ఫ్రిస్బీనిని కలిశాక అతడి జీవితమే అనూహ్య మలుపు తిరిగింది. ఎందుకంటే అతడు చెప్పే కథల్లో సువారో, అటాల్ మారుమూల ప్రాంతాల గురించి అక్కడి ప్రశాంతమైన జీవితం గురించి వినడంతో అక్కడకి వెళ్లాలనే కుతూహలం కలిగింది నీల్‌కి. అయితే యుద్ధకాల తీరప్రాంత పర్యవేక్షకులకు సామాగ్రిని అందజేస్తున్నప్పుడు నీల్ మొదటిసారిగా 1945లో సువారోను సందర్శించారు. అక్కడి చిన్న పగడపు దిబ్బ ఆయన్ను ఎంతాగనో ఆకర్షించింది.
అక్కడ నివశించడానికి అనుమతి పొంది మరి అక్కేడ ఏళ్ల తరబడి గడిపాడు. అక్టోబర్ 1952లో, నీల్ రెండు పిల్లులు, ఒక రేడియో, కొన్ని పనిముట్లు, ప్రాథమిక సామాగ్రితో ఆ నిర్జన అటాల్‌కు చేరుకున్నాడు. అయితే అక్కడ ఉన్న సమయంలో పాడుబడిన గుడిసెలను బాగుచేయడం, కూరగాయలు పండించడం, కోళ్లను పెంచడం వంటివి చేశాడు. అయితే ఆహారం కోసం ప్రధానంగా చేపలు, బ్రెడ్‌ఫ్రూట్, కొబ్బరి పీతలపై ఆధారపడేవాడు.
అంతేగాదు తాను ఆధునిక సమాజాన్ని ఎందుకు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడో వివరిస్తూ..తన ఆత్మకథలో ఇలా రాశారు. తాను పసిఫిక్ దీవులలో నివసించడానికి ఎంచుకున్నాను, ఎందుకంటే అక్కడి జీవితం ఒక ప్రత్యేకమైన వేగంతో సాగుతుంది. బహుశా ఇలా జీవించాలనే ఏర్పాటు చేసి ఉంటాడు దేవుడు మనం వేరుగా జీవిస్తున్నాం అని అంటుంటాడు నీల్. అయితే నీల్ ఏకాంత జీవితం వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా నిష్క్రమణకు దారితీసింది. అక్కడ ఉన్నప్పుడే తీవ్రమైన వెన్నుగాయం బారినపడ్డాడు, ఆతర్వాత కొన్నాళ్లకు కడుపు కేన్సర్ బారినపడి 1977 మార్చిలో సువారోను శాశ్వతంగా విడిచిపెట్టాడు. చివరికి 75 ఏళ్ల వయసులో రారోటోంగాలో మరణించాడు.
అయితే అతడు మరణించిన ఏడాది తర్వాత కుక్ దీవుల ప్రభుత్వం అతను నివసించిన అటోల్ సహజ పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు చేపట్టింది. 1978లో మొత్తం అటోల్, దాని చుట్ట ఉన్న పగడపు దిబ్బతో సహా ఆరు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని ఆ దేశపు తొలి జాతీయ ఉద్యానవన పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ కుక్ ఐలాండ్స్ నేషనల్ ఎన్విరాన్‌మెంట్ సర్వీస్ అధికారిక పర్యావరణ రికార్డులు సువారోను కీలకమైన పర్యావరణ సంరక్షణ కేంద్రంగా వర్ణిస్తాయి.
అంతేగాదు ఎవరైన దీన్ని సందర్శించాలనుకుంటే కఠినమైన నియమ నిబంధనలను పాటించాల్సిందేనట. అంతేగాదు నౌకలు ఇక్కడికి చేరుకోక ముందే అనుమతి తప్పనిసరి అట. అంతేగాదు నీల్ నివశించిన గుడిసెను సీజనల్ పార్క్ సంరక్షకులు భద్రపరిచి..అటుగా వచ్చే నావికులు, పడవ నడిపే వారికోసం గ్రంథాలయంగా మార్చారట. అంతేగాదు నీల్‌కి నివాళిగా అక్కడ ఆయన కాంక్రీట్ విగ్రహం కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే..నీల్ ఏకాంత జీవనం గడపాలనే ఉద్దేశ్యంతో సువారోకు రావడంతో దాని సహజ సౌందర్యంపై అంతర్జాతీయ దృష్టిపడి దాన్ని సంరక్షించుకునే దిశగా అడుగులు వేశాయి అక్కడి ప్రభుత్వాలు.
(చదవండి: నాలుగేళ్ల వయసుకే రచయిత్రిగా..ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులు!)


