జేడన్‌ పాంచ్‌ పటాకా.. విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌ | Jayden Lennox Fifer-New-Zeland-Beat West-Indies-5 Wickets-2nd ODI | Sakshi
Sakshi News home page

జేడన్‌ పాంచ్‌ పటాకా.. విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Jul 14 2026 7:09 AM | Updated on Jul 14 2026 7:14 AM

 Jayden Lennox Fifer-New-Zeland-Beat West-Indies-5 Wickets-2nd ODI

Photo Credit: ESPN Cricinfo

వెస్టిండీస్ టూర్‌లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. కివీస్‌ బౌలర్‌ జేడన్‌ లిన్నెక్స్‌ ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. గ‌యానా వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36 ఓవ‌ర్ల‌లో 138 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

ఓపెన‌ర్ జాన్ కాంప్‌బెల్ (43) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, అమిర్ జాంగో (24) ప‌ర్వాలేద‌నిపించాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో జేడ‌న్ లెన్నోక్స్ 5 వికెట్ల‌తో విండీస్ న‌డ్డి విరిచాడు. మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్న‌ర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 32.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 141 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

టామ్ లాథ‌మ్ (37 నాటౌట్‌),మైకెల్ బ్రాస్‌వెల్ (24 నాటౌట్‌) కివీస్‌ణు విజ‌య‌తీరాల‌కు చేర్చారు. అంత‌క‌ముందు విల్ యంగ్ (28), డారిల్ మిచెల్ (28) రాణించారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో ఖారీ పియ‌ర్రె 2 వికెట్లు తీయ‌గా, అల్జారీ జోసెఫ్‌, గుదకేశ్ మోతీ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు. ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో ఇరుజ‌ట్లు 1-1తో స‌మంగా నిలిచాయి. జూలై 16న మూడో వ‌న్డే జ‌ర‌గ‌నుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement