Photo credit : x
ఐపీఎల్‌లో వరుసగా రెండు నిరాశాజనక సీజన్ల అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 18 ఏళ్ల పాటు సేవలందించిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా జట్టును వీడగా.. అతడి స్థానంలో మాజీ భారత క్రికెటర్ హేమంగ్ బదానీ నియామకానికి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
హేమంగ్ బదానీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తే ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు జట్టును పూర్తిగా పునర్నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా పలువురు ఆటగాళ్లను విడుదల చేసే అవకాశముందని విశ్లేషణలు చెబుతున్నాయి. బదానీ కోచ్ అయితే వేటు పడబోయే ఆటగాళ్లలో స్పెన్సర్ జాన్సన్, ప్రశాంత్ వీర్, శ్రేయస్ గోపాల్ ముందు వరుసలో ఉన్నారిన తెలుస్తోంది. వీరి వేటుకు గల కారణాలను చూద్దాం.
స్పెన్సర్ జాన్సన్
ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ భవిష్యత్తు సీఎస్‌కేలో ప్రశ్నార్థకంగా మారింది. 2026 సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. గాయాల సమస్యలు తరచూ వేధిస్తుండటంతో పాటు సీఎస్‌కే వద్ద ఇప్పటికే నాణ్యమైన పేస్ బౌలింగ్ ఎంపికలు ఉండటంతో అతన్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రశాంత్ వీర్
భారీ ధరకు జట్టులోకి వచ్చిన ప్రశాంత్ వీర్ తాజా సీజన్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. బౌలింగ్‌లోనూ అవకాశాలు పెద్దగా దక్కకపోవడంతో అతన్ని విడుదల చేసి, అవసరమైతే తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసే వ్యూహాన్ని అనుసరించవచ్చని సమాచారం.
శ్రేయస్ గోపాల్
లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటికే జట్టులో నూర్ అహ్మద్, అకీల్ హొసేన్, రాహుల్ చాహర్ వంటి స్పిన్నర్లు ఉండటంతో అతనికి అవకాశాలు రాలేదు. దీంతో తదుపరి సీజన్‌కు ముందు గోపాల్‌ను విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.


