త్వరలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్ అందాయి. ఈ సిరీస్‌కు భారత జట్టును సెప్టెంబర్ 3న ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఆ రోజు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం ఖరారైనట్లు సమాచారం. అదే రోజే జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.
ఏషియన్ గేమ్స్ జట్టునే కొనసాగిస్తారా..?
నివేదికల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఏషియన్ గేమ్స్ 2026 కోసం ఎంపిక చేసిన జట్టునే కొనసాగిస్తారని తెలుస్తుంది. అయితే కొందరు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావాల్సి ఉంది.
హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ నివేదికల కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. వీరు ముగ్గురు ఇటీవల గాయాల బారిన పడి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు.
వీరితో పాటు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా సీఓఈలోనే ఉన్నారు. వీరిలో వరుణ్ చక్రవర్తి పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
ఒకవేళ బుమ్రా, హర్షిత్ రాణా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోతే వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అంచనా)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ


