మరోసారి రెచ్చిపోయిన సునీల్‌ నరైన్‌ | Sunil Narine Slams Conecuitive Blasting 50s in CPL 2026 | Sakshi
Sakshi News home page

మరోసారి రెచ్చిపోయిన సునీల్‌ నరైన్‌

Aug 30 2026 12:00 PM | Updated on Aug 30 2026 12:00 PM

Sunil Narine Slams Conecuitive Blasting 50s in CPL 2026

source: X

విండీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌) కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెచ్చిపోయాడు. నిన్న బార్బడోస్‌ ట్రైటెండ్స్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (55 (33), 2-14) ఇరగదీసిన ఇతను.. ఇవాళ బంతితో చెలరేగే అవకాశం​ రాకపోవడంతో, కేవలం బ్యాటింగ్‌ మెరుపులతో సరిపెట్టాడు. నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగినా ఈ మ్యాచ్‌లో అతడి జట్టు ఓడిపోవడం కొసమెరుపు.

మెరుపు అర్ద శతకం
ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేయగా.. నరైన్‌ విధ్వంసకర అర్ద శకతం బాదాడు. కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతడికి మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (52), కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (37 బంతుల్లో 60 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

వాస్తవానికి ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఇంకా భారీ స్కోర్‌ చేసుండాల్సింది. అయితే విటెల్‌ లాస్‌ (4-1-29-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి నైట్‌రైడర్స్‌ మెరుపు వీరులకు అడ్డుకట్ట వేశాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో లాస్‌.. మున్రో, పోలార్డ్‌ (0), మాథ్యూ ట్రాంప్‌ (0)లను ఔట్‌ చేశాడు. ఆఖర్లో హునైన్‌ షా (4-0-27-2) కూడా చెలరేగి అలెక్స్‌ హేల్స్‌ (5), గూలీ (0)ని క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో నైట్‌రైడర్స్‌ 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది.

నైట్‌రైడర్స్‌ కొంపముంచిన వరుణుడు
అనంతరం 181 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జమైకా ఓ మోస్తరుగా తమ ప్రయాణాన్ని సాగించింది. 14.4 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో జమైకాను విజేతగా ప్రకటించారు. 

డీఎల్‌ఎస్‌ పద్దతిలో మ్యాచ్‌ నిలిచేపోయే సమయానికి జమైకా గెలుపుకు 120 పరుగులే కావాల్సి ఉండింది. అప్పటికే ఆ మార్కును క్రాస్‌ చేయడంతో రిఫరీ జమైకాను విజేతగా ప్రకటించాడు. దీంతో నరైన్‌ సహా మున్రో, పూరన్‌ మెరుపుల వృధా అయ్యాయి. ఒకవేళ మ్యాచ్‌ పూర్తి సాగి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.

చదవండి: భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌ కీలక అప్‌డేట్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement