క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో పూర‌న్ విధ్వంసం | Pooran-81 Runs-Ford-Fifer-Saint Lucia-Won-By-6 Wkts Vs JKM-CPL 2026 | Sakshi
Sakshi News home page

క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో పూర‌న్ విధ్వంసం

Aug 22 2026 1:57 PM | Updated on Aug 22 2026 2:00 PM

Pooran-81 Runs-Ford-Fifer-Saint Lucia-Won-By-6 Wkts Vs JKM-CPL 2026

Photo Credit: Twitter

క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సెంట్ లూసియా కింగ్స్ హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేసింది. భార‌త కాల‌మాన ప్ర‌కారం శ‌నివారం ఉద‌యం జ‌రిగిన మ్యాచ్‌లో జ‌మైకా కింగ్స్‌మెన్‌పై సెంట్ లూసియా కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట మాథ్యూ ఫోర్డ్ ఐదు వికెట్లతో బౌలింగ్‌లో చెల‌రేగాడు. 

అనంత‌రం 170 ప‌రుగుల ల‌క్ష్య‌ ఛేద‌న‌లో సెంట్ లూసియా కింగ్ ఓపెన‌ర్‌ క‌మిల్ పూర‌న్ (49 బంతుల్లో 81 నాటౌట్‌) విధ్వంసం సృష్టించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. చివ‌ర్లో ఒబుస్ పియెన్నార్ (14 బంతుల్లో 34 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. 

తొలుత బ్యాటింగ్ చేసిన జ‌మైక‌న్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్‌కేసీ కార్తి (45 బంతుల్లో 50) అర్ధ‌సెంచ‌రీ సాధించ‌గా, ఆండ్రీ ర‌సెల్ (25), ఓడియ‌న్ స్మిత్ (27 నాటౌట్‌) ఆఖర్లో ధాటిగా ఆడ‌డంతో జ‌మైకా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. మాథ్యూ ఫోర్డ్ 5 వికెట్లు తీయ‌గా, షెడ్లే, మ‌హీష్ తీక్ష‌ణ‌, జోషువా బిష‌ప్‌లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం సెంట్ లూసియా కింగ్స్ 18.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసి గెలుపొందింది. విటెల్ లూయిస్‌, హునెయిన్ షా చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో సెంట్ లూసియా జ‌ట్టు 6 పాయింట్ల‌తో తొలి స్థానంలో ఉండ‌గా, ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాలు, 4 ఓట‌ముల‌తో జ‌మైకా ఐదో స్థానంలో కొన‌సాగుతోంది.

చదవండి: '6-7'తో మత్తెక్కిస్తోన్న చిన్నది.. క్రికెట్‌లో జెన్-జెడ్‌, జెన్-ఆల్ఫా శ‌కం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement