భారత్‌కు దక్కని విజయం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు | New Zealand Vs India 1st Test Match-Wellington Ends-UP-Drawn | Sakshi
Sakshi News home page

NZ Vs IND: భారత్‌కు దక్కని విజయం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు

Nov 23 2026 10:26 AM | Updated on Nov 23 2026 10:42 AM

New Zealand Vs India 1st Test Match-Wellington Ends-UP-Drawn

Photo Credit: BCCI Twitter

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇరుజ‌ట్ల అంగీకారంతో మ‌రో 15 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే మ్యాచ్ డ్రాగా ముగిసిన‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. మ్యాచ్‌ డ్రా స‌మ‌యానికి న్యూజిలాండ్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 239 ప‌రుగులు చేసింది. 

డారిల్ మిచెల్ (186 బంతుల్లో 49 నాటౌట్‌), గ్లెన్ ఫిలిప్స్ (126 బంతుల్లో 26 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ప్ర‌సిధ్ క్రిష్ణ‌ రెండు వికెట్లు తీయ‌గా, బుమ్రా, అన్షుల్‌, సుంద‌ర్‌లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల న‌ష్టానికి 720 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. 

భార‌త బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (136), రిష‌బ్ పంత్ (128) సెంచ‌రీల‌తో క‌దం తొక్క‌గా, గిల్ (98) రెండు ప‌రుగుల తేడాతో సెంచ‌రీ చేజార్చుకోగా,  జైస్వాల్ (85), ప‌డిక్క‌ల్ (80), ధ్రువ్ జురెల్ (78) అర్థ‌సెంచ‌రీల‌తో ఆక‌ట్టుకున్నారు. కివీస్ బౌలర్ల‌లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీయ‌గా, ర‌చిన్ ర‌వీంద్ర రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

ఇక న్యూజిలాండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 368 ప‌రుగుల‌కు ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ (175), గ్లెన్ ఫిలిప్స్ (118) శ‌త‌కాలు సాధించ‌గా, భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా నాలుగు వికెట్లు తీయ‌గా, ఆకాశ్ దీప్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు, ప్ర‌సిధ్ క్రిష్ణ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 27 నుంచి) క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. మ్యాచ్ డ్రాగా ముగియ‌డంతో భార‌త్ డ‌బ్ల్యూటీసీ పాయింట్లో ఎలాంటి మార్పు లేదు. ప్ర‌స్తుతం ప‌ట్టిక‌లో భార‌త్ నాలుగో స్థానంలోనే కొన‌సాగుతుంది.

ఇదీ చదవండి: INDA Vs PAK-A: గెలిచామన్న సంతోషంలో పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement