breaking news
Matthew Forde
-
సెన్స్‌లెస్ బ్యాటింగ్.. 66 ఏళ్ల వయసులో నేనూ చితక్కొడతా!
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. లక్నో వేదికగా మంగళవారం నాటి తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కరేబియన్లు విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలోనే ఊదేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు శతకం (43 బంతుల్లో 102 నాటౌట్)తో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. భారత్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ యువ పేసర్ మాథ్యూ ఫోర్డ్ చెత్త బౌలింగ్‌తో విమర్శలు మూటగట్టుకున్నాడు.Sealed in 𝙨𝙤𝙢𝙚 𝙨𝙩𝙮𝙡𝙚! 💥 🎥 A breathtaking batting display from #TeamIndia to clinch the 1️⃣st T20I by eight wickets 👊 Scorecard ▶️ https://t.co/2czVyKWreK #INDvWI | @mflone_ https://t.co/JgxYkZLDwS— BCCI (@BCCI) October 6, 2026అతడి బౌలింగ్‌లో ఆడేసుకున్నారువిండీస్ బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఫోర్డ్.. తొలి ఓవర్లోనే పదిహేను పరుగులు ఇచ్చుకున్నాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఇక పద్నాలుగో ఓవర్లో కెప్టెన్ షాయీ హోప్ మరోసారి ఫోర్డ్ చేతికి బంతినిచ్చాడు.ఈసారి కూడా అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఫోర్డ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ మూడు సిక్సర్లు, ఓ బౌండరీ బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఫోర్డ్‌కు ఈ మ్యాచ్‌లో పీడకలే మిగిలింది. కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 39 పరుగులు ఇచ్చుకుని వికెట్ మాత్రం తీయలేకపోయాడు.66 ఏళ్ల వయసులో నేనూ చితక్కొడతా!ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ 24 ఏళ్ల మాథ్యూ ఫోర్డ్ బౌలింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఫోర్డ్ని ఆల్‌రౌండర్ అని ఎలా పిలుస్తున్నారు? ప్రస్తుతం నేను.. 66 ఏళ్ల వయసులోనూ అతడి బౌలింగ్‌ను చితక్కొట్టగలను.అతడి బౌలింగ్ అంత చెత్తగా ఉంది. షమార్ జోసెఫ్ బౌలింగ్‌లో కూడా పస తగ్గిపోయింది. అతడు అత్యంత సాధారణంగా బౌలింగ్ చేస్తున్నాడు. నిజానికి జాన్ కాంప్‌బెల్, ఆమిర్ జాంగూ, జేడన్ సీల్స్ విండీస్ తరఫున టీ20 ఫార్మాట్లోనూ ఆడాలి.వారికి బదులు ఎవరో కొందరు అనామకులు ఆడటం ఎంతమాత్రం సరికాదు. వెస్టిండీస్ జట్టు అతి సాధారణంగా ఉంది. వాళ్లు జట్టును ఎలా ఎంపిక చేస్తున్నారో తెలియదు. నిజానికి ఈ మ్యాచ్‌లో విండీస్ 190- 195 వరకు స్కోరు చేయగలిగేది. సెన్స్‌లెస్ బ్యాటింగ్కానీ వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం స్లాగ్ షాట్లు ఆడేందుకే బ్యాటర్లు ప్రయత్నించారు. నిజంగా అదొక తెలివిలేని బ్యాటింగ్. సెన్స్‌లెస్’’ అంటూ చిక్కా విండీస్ బ్యాటింగ్ విభాగంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియాతో తొలి టీ20లో కెప్టెన్ షాయీ హోప్ (37 బంతుల్లో 52), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 56) అర్ధ శతకాలు చేశారు. మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆల్‌రౌండర్ నమన్ ధిర్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు.. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: నా కల నెరవేరింది.. అతడొక అద్భుతం -
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో పూరన్ విధ్వంసం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెంట్ లూసియా కింగ్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో జమైకా కింగ్స్‌మెన్‌పై సెంట్ లూసియా కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట మాథ్యూ ఫోర్డ్ ఐదు వికెట్లతో బౌలింగ్‌లో చెలరేగాడు. అనంతరం 170 పరుగుల లక్ష్య ఛేదనలో సెంట్ లూసియా కింగ్ ఓపెనర్ కమిల్ పూరన్ (49 బంతుల్లో 81 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో ఒబుస్ పియెన్నార్ (14 బంతుల్లో 34 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకన్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్కేసీ కార్తి (45 బంతుల్లో 50) అర్ధసెంచరీ సాధించగా, ఆండ్రీ రసెల్ (25), ఓడియన్ స్మిత్ (27 నాటౌట్) ఆఖర్లో ధాటిగా ఆడడంతో జమైకా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మాథ్యూ ఫోర్డ్ 5 వికెట్లు తీయగా, షెడ్లే, మహీష్ తీక్షణ, జోషువా బిషప్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం సెంట్ లూసియా కింగ్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలుపొందింది. విటెల్ లూయిస్, హునెయిన్ షా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో సెంట్ లూసియా జట్టు 6 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, 4 ఓటములతో జమైకా ఐదో స్థానంలో కొనసాగుతోంది.Pulverized by Pooran 💪💥A second CPL fifty for Kamil Pooran! 🇱🇨 x 🇯🇲#CPL26 #SLKvJK #BiggestPartyInSport #CricketPlayedLouder #BYD pic.twitter.com/0JYbqFl0X7— CPL T20 (@CPL) August 22, 2026Making the most of the opportunity! 👏 Kamil Pooran rose to the occasion! 🇱🇨 x 🇯🇲#CPL26 #SLKvJK #BiggestPartyInSport #CricketPlayedLouder pic.twitter.com/1HY0Suw0xo— CPL T20 (@CPL) August 22, 2026చదవండి: '6-7'తో మత్తెక్కిస్తోన్న చిన్నది.. క్రికెట్లో జెన్-జెడ్, జెన్-ఆల్ఫా శకం!


