బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం | ACC Mens Asia Cup Rising Stars 2026: Sri Lanka A beat Bangladesh A by 7 Wickets | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం

Nov 23 2026 8:45 PM | Updated on Nov 23 2026 8:48 PM

ACC Mens Asia Cup Rising Stars 2026: Sri Lanka A beat Bangladesh A by 7 Wickets

source: X

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో శ్రీలంక-ఏ జట్టు హ్యాట్రిక్‌ విజయాలు సాధించి సెమీస్‌కు చేరింది. గ్రూప్‌-ఏలో తొలుత ఆఫ్ఘనిస్తాన్‌-ఏ, హాంగ్‌కాంగ్‌ చైనా జట్లపై విజయాలు సాధించిన ఆ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్‌-ఏను కూడా ఓడించి, గ్రూప్‌ దశలో ఓటమెరుగని జట్టుగా సెమీస్‌కు చేరింది. 

ఈ మ్యాచ్‌లో ఓడినా బంగ్లాదేశ్‌-ఏ జట్టు కూడా సెమీస్‌కు చేరింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌-ఏ, హాంగ్‌కాంగ్‌ చైనా జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్‌-బి నుంచి పాకిస్తాన్‌-ఏ ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. భారత్‌-ఏ, నేపాల్‌, యూఏఈ జట్లు రేసులో ఉన్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. దోహాలోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జట్టు బంగ్లాదేశ్‌-ఏపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. రవిందు ఫెర్నాండో (4-30), వనుజ సహాన్‌ (3-20), విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌ (2-22), దులజ్‌ సముదిత (1-28) ధాటికి 42.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో 32 పరుగులు చేసిన పర్వేజ్‌ హొసేన్‌ ఎమోన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. నిషాన్‌ మధుష్క (51 నాటౌట్‌) అజేయ అర్ద సెంచరీతో, కెప్టెన్‌ పవన్‌ రత్నాయకే (45) రాణించడంతో 21.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరారు. సెమీస్‌లో శ్రీలంక గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో తలపడనుంది. బంగ్లాదేశ్‌ అదే గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో పోటీపడుతుంది. 

ఇదీ చదవండి: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ దూరం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement