సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ దూరం | Bangladesh Squad For South Africa ODIs Announced, Nahid Rana Remains Unavailable | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ దూరం

Nov 23 2026 8:04 PM | Updated on Nov 23 2026 8:29 PM

Bangladesh Squad For South Africa ODIs Announced, Nahid Rana Remains Unavailable

source: X

సౌతాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 15 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్‌ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. తౌహిద్‌ హృదోయ్‌ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా స్టార్ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు.

జట్టులో నాలుగు మార్పులు
ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బంగ్లాదేశ్ నాలుగు మార్పులు చేసింది. యాసిర్ అలీ, మొహమ్మద్ నయీమ్, జాకర్ అలీకి చోటు కల్పించింది. అక్టోబర్‌లో యూఏఈలో జరిగిన వన్డే ట్రై సిరీస్‌కు దూరమైన లిటన్ దాస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు నూరుల్ హసన్, సైఫ్ హసన్, మొసాద్దెక్ హుస్సేన్, అలిస్ ఇస్లాం, హసన్ మహమూద్, సౌమ్య సర్కార్‌లకు ఈసారి అవకాశం దక్కలేదు.

ఈ సిరీస్‌ డిసెంబర్‌ 1, 4, 7 తేదీల్లో ఈస్ట్‌ లండన్‌, గ్వెబెర్హా, కేప్‌టౌన్‌ వేదికలుగా జరుగనుంది. బంగ్లాదేశ్‌ టెస్ట్‌ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

రెండో టెస్ట్‌ ఇవాళే మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌ టీ విరామం సమయానికి 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. వన్డే సిరీస్‌ అనంతరం డిసెంబర్‌ 10, 12, 13 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది.

సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు: 
లిటన్ దాస్ (కెప్టెన్), తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నయీమ్ షేక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, యాసిర్ అలీ చౌదరి, జాకర్ అలీ అనిక్, రిషాయ్ హసన్, మెహిద్ హసన్ ఇస్లాం ఖలీద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం.

ఇదీ చదవండి: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement