Nahid Rana
-
బంగ్లా ప్లేయర్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ
బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్ రాణాపై ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కఠిన చర్యలు తీసుకుంది. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిస్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. రాణా తన తప్పును అంగీకరించడంతో జరిమానా పడలేదు. ఫార్మల్ హియరింగ్ కూడా అవసరం లేకుండా అతి తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఐసీసీ నియమావళి ప్రకారం, రాణా ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు పాల్పడ్డాడు.రాణా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఐర్లాండ్ పర్యటనలోనూ ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పట్లో రాణా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు.ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు 24 నెలల్లో 4 డీ మెరిట్ పాయింట్లు మూటగట్టుకుంటే సస్పెన్షన్‌కు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. రాణా ఇకనై జాగ్రత్తగా ఉండకపోతే నిషేధాన్ని ఎదుర్కోక తప్పదు.ఇంతకీ ఏం జరగిందంటే.. ఆ మ్యాచ్‌లో రాణా అద్భుతమైన బంతి వేసి ఇంగ్లిస్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే శృతిమంచి సంబురాలు చేసుకున్నాడు. ఈ చర్యలు ఇంగ్లిస్‌ను ప్రేరేపించేలా ఉన్నాయని అంపైర్లు భావించారు. దీంతో రాణాపై డిసిప్లినరి చర్యలు తీసుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రాణా ఆ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఫలితంగా తన జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. డక్త్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇవాళ జరుగుతుంది. -
గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్!
బంగ్లాదేశ్ తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్‌ను స్లెడ్జింగ్ చేయడం మ్యాచ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 285 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా, మార్నస్ లబుషేన్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కూపర్‌కు జత కలిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో నహీద్ రానా 11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లిస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఔట్‌సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లిస్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియన్ వైపు వెళుతున్న తరుణంలో నహీద్ రానా అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇంగ్లిస్‌ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నహీద్ రానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకో అని అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. Big Wicket for Bangladesh! Josh Inglis departs. Caught by Litton Das, bowled by Nahid Rana! pic.twitter.com/waRZRvW6mX— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026చదవండి: 'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్ 9) జరిగిన తొలి మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్‌వర్త్ లూయిస్) సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్‌కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్ హృదోయ్ (31), తస్కిన్ అహ్మద్ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్లెట్కు ఓ వికెట్ దక్కింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. బ్యాటింగ్‌లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్‌లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (5.2-0-24-2), తస్కిన్ (5-0-28-1) కూడా రాణించారు. -
PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో కొనసాగేందుకు తమ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చిన నిరంభ్యంతర పత్రాల్ని (NOC) రద్దు చేసింది. కాగా ఐపీఎల్-2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ పీఎస్ఎల్లో చేరిన సంగతి తెలిసిందే.జట్టు విజయాల్లో కీలక పాత్రలాహోర్ ఖలందర్స్‌తో జట్టుకట్టిన ముస్తాఫిజుర్.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ముస్తాఫిజుర్‌ను బీసీబీ వెనక్కి పిలిపించింది. కానీ గాయం వల్ల అతడు మొదటి రెండు వన్డేలకు దూరం కాగా.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టుకు విజయం అందించడంలో తోడ్పడ్డాడు.పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్‌లు ఆడడుఅయితే, ఈ మ్యాచ్ తర్వాత బీసీబీ కీలక ప్రకటన చేసింది. పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు ముస్తాఫిజుర్ రహమాన్ పంపబోమని తెలిపింది. ఫిట్నెస్ సమస్యల భయం దృష్ట్యా అతడికి ఇచ్చిన NOCని రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కి సమాచారం ఇచ్చింది.కాగా తొలుత మార్చి 26- ఏప్రిల్ 12 వరకు... తర్వాత ఏప్రిల్ 24- మే 3 వరకు ముస్తాఫిజుర్‌కు బీసీబీ NOC జారీ చేసింది. ఇక ముస్తాఫిజుర్‌తో పాటు మరో పేసర్ నహీద్ రాణా NOCని కూడా బీసీబీ రద్దు చేయడం గమనార్హం. నహీద్ రాణా NOC కూడా రద్దుకాగా నహీద్ రాణా పీఎస్ఎల్లో పెషావర్ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. వన్డే సిరీస్ ఆడేందుకు నహీద్ స్వదేశానికి తిరిగి వచ్చాడు.న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు నహీద్. అయితే, అతడిని కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు బీసీబీ. దీంతో పీఎస్ఎల్లో ప్లే ఆఫ్స్ ఆడేందుకు నహీద్ వెళ్తాడని భావించగా.. బీసీబీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కారణం ఇదేపీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు రాడని స్పష్టం చేసింది. కాగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు నహీద్‌ను సన్నద్ధం చేసేందుకే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా పీఎస్ఎల్లో తమదైన ముద్రవేస్తూ లీగ్‌కు కాస్త ఊపు తెచ్చిన ఇద్దరు ప్లేయర్లను కీలక సమయంలో తప్పించడం ద్వారా బీసీబీ.. పీసీబీకి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో బంగ్లా కైవసం చేసుకుంది. అంతకుముందు వెస్టిండీస్, పాకిస్తాన్‌లపై కూడా వన్డే సిరీస్‌లు గెలిచి సత్తా చాటింది. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న తొలి వన్డే జరుగగా కివీస్ గెలుపొందింది.198 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. యువ పేసర్ నహీద్ రాణా (5/32) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. చెలరేగిన నహీద్ఓపెనర్ నిక్ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ (14), హెన్రీ నికోల్స్ (13), విల్ యంగ్ (2), మొహమ్మద్ అబ్బాస్ (19), డీన్ ఫోక్స్ క్రాఫ్ట్ (15), క్లార్క్సన్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. తన్జిద్, షంటో హాఫ్ సెంచరీలుబంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నహీద్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్ హసన్ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), నజ్ముల్ హసన్ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సైఫ్ హసన్ (8), సౌమ్య సర్కార్ (8), లిటన్ దాస్ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్‌కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జైడన్ లెనాక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.ఫీజులో 10 శాతం కోతఅయితే, న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్ ఇందుకు వేదిక.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుpic.twitter.com/3kSqC7iEUy 🚨 BANGLADESH WIN 🚨BAN vs NZ — 2nd ODI | Sher-e-Bangla, DhakaBangladesh chase down 199 with 6 wickets in hand!The heroes of the win:-Nahid Rana — 5 wickets, dismantled the NZ batting lineup-Tanzid Hasan Tamim — 76 off 58 balls, set the chase on…— Suresh N (@TheDugoutStats) April 20, 2026 -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. సోమవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్‌పై 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా జట్టు 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో నిక్ కెల్లీ (102 బంతుల్లో 83 పరుగులు, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెల్లీ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. మిగితా బ్యాటర్ల నుంచి అతడి సహకారం లభించలేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాణా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. అతడితో పాటు షోర్ఫుల్ ఇస్లాం రెండు.. రిషాద్, టాస్కిన్ అహ్మద్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.తాంజిద్ మెరుపులుఅనంతరం 199 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ తాంజిద్ హసన్ (58 బంతుల్లో, 76 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో నజ్ముల్ హొస్సేన్ శాంటో(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో జేడెన్ లెనాక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్మిత్, ఓ రూర్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఏప్రిల్ 23న ఛటోగ్రామ్‌లో జరగనుంది.చదవండి: IPL 2026: అతడిపై మీకు నమ్మకం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్! -
పాక్‌కు ఘోర ఓటమి.. షాహిన్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లా చేతిలో పాక్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే పాకిస్తాన్ జట్టు ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.మూడు వన్డేల సిరీస్‌ఈ క్రమంలో వరల్డ్‌కప్ టోర్నీ అనంతరం తొలుత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది పాక్ జట్టు. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా.. బుధవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 114 పరుగులకే ఆలౌట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిని పాక్.. 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 27 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్ ఫాహీమ్ ఆష్రఫ్ 37 పరుగులతో పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ మూడు, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.15.1 ఓవర్లలోనే ఫినిష్లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ కేవలం 15.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో విఫలమైన బాబర్ ఆజంను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పించింది యాజమాన్యం.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో తొలి వన్డే సందర్భంగా సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుసేన్, మాజ్ సదాకత్ వన్డేల్లో అరంగేట్రం చేశారు. వీరిలో ఫర్హాన్ కాస్త ఫర్వాలేదనిపించగా.. అతడి ఓపెనింగ్ జోడీగా వచ్చిన సదాకత్ 18 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షామిల్ 4 పరుగులకే అవుటయ్యాడు.ఓడినా పర్లేదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది స్పందిస్తూ.. ‘‘ఓడిపోయినపుడు ఎన్నో అంశాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది యువ జట్టు. చివరి వరకు ఈ జట్టుకు నేను మద్దతుగా ఉంటాను’’ అని తెలిపాడు.అదే విధంగా.. ‘‘వన్డే క్రికెట్లో భాగస్వామ్యాల నిర్మాణం అత్యంత ముఖ్యం. బ్యాట్, బాల్.. రెండింటితోనూ రాణించాల్సి ఉంటుంది. జట్టుకు ఇదొక మేలుకొలుపు లాంటిది. నహీద్ రాణా రానంత వరకు మా జట్టు బాగానే ఆడింది.అత్యద్భుతంగా బౌలింగ్ చేసిఅయితే, అతడు అత్యద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఆ రెండింటిపై దృష్టి పెట్టి సానుకూల ఫలితం సాధిస్తాం’’ అని షాహిన్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లా- పాక్ మధ్య మార్చి 13న రెండు వన్డే, మార్చి 15న మూడో వన్డే జరుగుతాయి. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’


