బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న తొలి వన్డే జరుగగా కివీస్ గెలుపొందింది.
198 పరుగులకు ఆలౌట్
ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. యువ పేసర్ నహీద్ రాణా (5/32) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది.
చెలరేగిన నహీద్
ఓపెనర్ నిక్ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ (14), హెన్రీ నికోల్స్ (13), విల్ యంగ్ (2), మొహమ్మద్ అబ్బాస్ (19), డీన్ ఫోక్స్ క్రాఫ్ట్ (15), క్లార్క్‌సన్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు.
తన్జిద్, షంటో హాఫ్ సెంచరీలు
బంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నహీద్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్ హసన్ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), నజ్ముల్ హసన్ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సైఫ్ హసన్ (8), సౌమ్య సర్కార్ (8), లిటన్ దాస్ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్‌కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జైడన్ లెనాక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.
ఫీజులో 10 శాతం కోత
అయితే, న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్ ఇందుకు వేదిక.
చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు
pic.twitter.com/3kSqC7iEUy
🚨 BANGLADESH WIN 🚨
BAN vs NZ — 2nd ODI | Sher-e-Bangla, Dhaka
Bangladesh chase down 199 with 6 wickets in hand!
The heroes of the win:
-Nahid Rana — 5 wickets, dismantled the NZ batting lineup
-Tanzid Hasan Tamim — 76 off 58 balls, set the chase on…— Suresh N (@TheDugoutStats) April 20, 2026


