ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ సంచలన విజయం | Only for second time in 36 years, Bangladesh defeat Australia in ODIs after stunning them in Mirpur | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ సంచలన విజయం

Jun 9 2026 8:15 PM | Updated on Jun 9 2026 9:00 PM

Only for second time in 36 years, Bangladesh defeat Australia in ODIs after stunning them in Mirpur

ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్‌ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 9) జరిగిన తొలి మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్‌వర్త్‌ లూయిస్‌) సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్‌కు షాకిచ్చింది.

ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆరో నంబర్‌ ఆటగాడు మొసద్దెక్‌ హొస్సేన్‌ (86 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (54), నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్‌ హృదోయ్‌ (31), తస్కిన్‌ అహ్మద్‌ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్‌ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. లియామ్‌ స్కాట్‌, మ్యాట్‌ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్‌లెట్‌కు ఓ వికెట్‌ దక్కింది.

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. 

బ్యాటింగ్‌లో సత్తా చాటిన మొసద్దెక్‌ (10-1-37-2) బౌలింగ్‌లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం​ అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (5.2-0-24-2), తస్కిన్‌ (5-0-28-1) కూడా రాణించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement