CWG 2026: భారత్‌కు షాక్‌.. స్టార్‌ జుడో ప్లేయర్‌పై వేటు | CWG 2026 Day 2 July 24 Glasgow: Indian Athlets In Action | Sakshi
Sakshi News home page

CWG 2026: భారత్‌కు షాక్‌.. స్టార్‌ జుడో ప్లేయర్‌పై వేటు

Jul 24 2026 4:55 PM | Updated on Jul 24 2026 5:15 PM

CWG 2026 Day 2 July 24 Glasgow: Indian Athlets In Action

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా స్విమ్మ‌ర్స్ అద‌ర‌గొట్టారు. ఈత‌గాళ్లు కార్తీక్ బుడిగిన, అలీ ఇమామ్‌లు ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించారు. 

పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ S13 విభాగంలో హీట్స్ రేసులో కార్తీక్ 57.10 సెకన్ల సమయంలో మూడో స్థానంలో నిలవగా.. అలీ ఇమామ్ 1:05.32 సెకన్ల టైమింగ్‌తో చివరి క్వాలిఫైయింగ్ స్థానాన్ని దక్కించుకుని ఫైనల్లో అడుగుపెట్టారు. మ‌రోవైపు 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శ‌నివారం జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్స్‌లో శ్రీహరి పాల్గోనున్నాడు.

భారత్‌కు షాక్‌
భార‌త్‌కు మ‌రో భారీ షాక్ త‌గిలింది. స్టార్ జుడుకో తులికా మాన్  కామన్వెల్త్ గేమ్స్‌కు దూర‌మైంది. డోపింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. గ‌తేడాది నుంచి ఆమె డోపింగ్ టెస్ట్‌ల‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో నాడా ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

కాగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌-2022లో తులిక సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించింది. ఇక ఇది ఇలా ఉండ‌గా మ‌రో భారత జుడో ప్లేయ‌ర్‌ అరుణ్‌ కుమార్‌ కామన్వెల్త్‌ క్రీడలకు దూరమయ్యాడు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అత‌డిపై నాడా నిషేధం విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement