స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.
గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్ సీజన్లలో ఈయన 91 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్.. పాక్‌తో టెస్ట్‌లకు దూరమయ్యాడు.
అతడి స్ధానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది నిజంగా కరేబియన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. జోషఫ్ వంటి స్టార్ బౌలర్ జట్టులో లేకపోవడంతో విండీస్ గడ్డపై పాక్ బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు.
కాగా ఆల్‌రౌండర్ కిమో పాల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కేమర్ రోచ్, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్‌లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని 'బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ' మైదానంలో జరగనుంది. ఈ వేదికపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం.


