సిక్సర్లతో జట్టును గెలిపించిన భారత బ్యాటర్‌! | Richa Ghosh-Sixes-Manchester Super Giants-Win Vs LDNW Hundred Tourney | Sakshi
Sakshi News home page

Hundred 2026: సిక్సర్లతో జట్టును గెలిపించిన భారత బ్యాటర్‌!

Jul 24 2026 1:53 PM | Updated on Jul 24 2026 2:00 PM

Richa Ghosh-Sixes-Manchester Super Giants-Win Vs LDNW Hundred Tourney

Photo Credit: BCCI Twitter

హండ్రెడ్ కాంపిటీష‌న్ 2026లో భార‌త మ‌హిళా బ్యాట‌ర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా భార‌త వికెట్‌కీప‌ర్ రిచా ఘోష్ రెండు భారీ సిక్స‌ర్ల‌తో త‌న జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 81 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన మాంచెస్ట‌ర్ రిచా ( 5 బంతుల్లో 15 నాటౌట్‌, రెండు సిక్స‌ర్లు) ధాటికి 59 బంతుల్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 

మిగిలిన‌వారిలో పేజ్ స్కోఫీల్డ్ (15 బంతుల్లో 22 నాటౌట్‌), మెగ్ లానింగ్ (24 బంతుల్లో 21) రాణించారు. అంత‌క‌ముందు లండ‌న్ స్పిరిట్ వుమెన్ 91 బంతుల్లో 80 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ చార్లెట్ డీన్ (14), చారిస్ ప‌వెలి (13) ప‌ర్వాలేద‌నిపించారు. మాంచెస్ట‌ర్ బౌల‌ర్ల‌లో రియానా మెక్‌డొనాల్డ్ 4 వికెట్లతో స‌త్తా చాటింది.

ఇక పురుషుల క్రికెట్‌లో మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్ ఏడు ప‌రుగుల తేడాతో లండ‌న్ స్పిరిట్‌పై విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్ట‌ర్ 100 బంతుల్లో 9 వికెట్ల న‌ష్టానికి 138 ప‌రుగులు చేసింది. టిమ్ సిఫెర్ట్ (45 బంతుల్లో 67) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అనంత‌రం లండ‌న్ నైట్స్ 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 131 ప‌రుగులు చేసింది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 69 నాటౌట్‌) అజేయంగా నిలిచిన‌ప్ప‌టికీ జ‌ట్టును గెలిపించ‌కలేక‌పోయాడు.

 

Read: ప్లాన్‌ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్‌ అప్పుడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement