breaking news
Hundred Women's Competition
-
కివీస్ బ్యాటర్ వన్‌మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది. ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.We were all Jos Buttler watching that finish 🫣#TheHundredFinal pic.twitter.com/w06H16zE0z— The Hundred (@thehundred) August 16, 2026Five fifties in 10 innings for Tim Seifert in this year's Hundred 🔥pic.twitter.com/XFTJa0GeZV— Cricinfo (@cricinfo) August 16, 2026చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే' -
సన్‌రైజర్స్ కొంపముంచిన క్లాసెన్.. ఫైనల్లో సూపర్ జెయింట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, ఓపెనర్ పాల్ వాల్టర్ విధ్వంసానికి తోడుగా బౌలింగ్‌లో జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన సూపర్ జెయింట్స్‌కు విక్టరీని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాల్ వాల్టర్ (46 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), క్లాసెన్ (26 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ జోస్ బట్లర్ (33) రాణించాడు. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రియాన్ రికిల్టన్ (54 నాటౌట్) చివరివరకు అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. హ్యారీ బ్రూక్ (49) నిధానంగా ఆడడం జట్టు కొంపముంచింది. ఆద్యంతం సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్ లీడ్స్ పరుగులు చేయడంలో విఫలమైంది. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. రేపు జరగనున్న హండ్రెడ్ మెన్స్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ తలపడనుంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్లాసెన్ హండ్రెడ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌కు ప్రత్యర్థిగా ఆడి వాళ్లు ఫైనల్ చేరకుండా సైంధవుడిలా అడ్డుపడ్డాడు.ఫైనల్లో సన్‌రైజర్స్ వుమెన్ టీంమరోవైపు హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో మాత్రం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సదరన్ బ్రేవ్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ లీడ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (32) టాప్ స్కోరర్. అన్నాబెల్ సదర్లాండ్, హన్నా బేకర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్ జట్టు 89 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. లారెన్ విన్ఫీల్డ్ (37), దీప్తి శర్మ (28 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రేపే జరగనున్న వుమెన్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.SunRisers Leeds Women enters @thehundred final after beating Southern Brave Women, while Manchester Super Giants Men does so in other match beating #SRL.Lauren Winfield-Hill (37), Deepti Sharma (28* & 1/24) & Hannah Baker (2/13) led #SRLW, while #MSG had Paul Walter (80),…— The CricHub (@thecrichub_live) August 14, 2026 -
ఎలిమినేటర్ ముంగిట సన్‌రైజర్స్ విధ్వంసం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఐదో విజయంతో పట్టికలో రెండో స్థానానికి చేరుకొని ఎలిమినేటర్ పోరుకు మరింత దగ్గరైంది. మంగళవారం రాత్రి మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్ 41 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్ (36 బంతుల్లో 62 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ డాని గిబ్సన్ (13 బంతుల్లో 24) రాణించడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో మాడీ విల్లర్స్ 2 వికెట్లు తీసింది. అనంతరం మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు స్మృతి మంధాన (17 బంతుల్లో 28), గ్రేస్ స్క్రీవెన్స్ (24 బంతుల్లో 31) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జొనాసన్ 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, అన్నాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన అన్నాబెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంది.Annabel Sutherland just smashed THREE sixes in a row off the final three balls of the innings 🤯That was special. #TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oQ9EswA72z— The Hundred (@thehundred) August 11, 2026Smriti Mandhana is on the charge 💥Watch the #RoadToTheEliminator action LIVE on Sky Sports Main Event, Sky Sports Cricket and YouTube 📺#TheHundred pic.twitter.com/VDCdJJu8sk— The Hundred (@thehundred) August 11, 2026చదవండి: తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా -
ఇదేమి ఆటతీరు.. స్వల్ప ఛేదనలో నానా తంటాలు!
సాధారణంగా 100 బంతుల్లో 86 పరుగుల టార్గెట్ అంటే సునాయాసంగా ఊదిపారేయచ్చు. కానీ వెల్ష్ ఫైర్ జట్టు మాత్రం ఆ చిన్న టార్గెట్‌ను అందుకోవడానికి నానా తంటాలు పడింది. చివరకు ఎలాగోలా 3 వికెట్ల తేడాతో గెలిచి గట్టెక్కింది. హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌పై వెల్ష్‌ఫైర్ కష్టపడి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. రియానా మెక్‌డొనాల్డ్ (18), స్మృతి మంధాన (15) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో ఎవరు పెద్దగా రాణించలేదు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో ఒర్లా ప్రెండెగాస్ట్ 4 వికెట్లతో చెలరేగగా, హెథర్ గ్రహమ్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెల్ష్పైర్ కూడా పూర్తిగా తడబడినప్పటికీ మరో 9 బంతులు మిగిలి ఉండగా 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. అయితే ఒక దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వెల్ష్ఫైర్ను హెథర్ గ్రాహం (16 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఓపెనర్లు జార్జియా వోల్ (16), సారా బ్రైస్ (16) రాణించారు. మాంచెస్టర్ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్ 3 వికెట్లు తీయగా, రెబెక్కా టైసన్, మాడీ విల్లర్స్, కేథరిన్ బ్రైస్ తలా ఒక వికెట్ తీశారు.కాగా వెల్ష్ఫైర్కు ఇది ఆరు మ్యాచ్‌ల్లో మూడో విజయం కాగా, మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌కు రెండో పరాజయం. 14 పాయింట్లతో మాంచెస్టర్ జెయింట్స్ మూడో స్థానంలో ఉండగా, వెల్ష్‌ఫైర్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.Read: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం! -
జెమీమా మెరుపులు వృథా.. ఆఖరి బంతికి సంచలన విజయం!
హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో సదరన్ బ్రేవ్ వుమెన్ తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం రాత్రి సదరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్‌తో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులుచేసింది. లారా వోల్వర్ట్ (45 బంతుల్లో 48), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 25) రాణించారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో హెథర్ గ్రహమ్, గ్రేస్ పాట్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెల్ష్ ఫైర్ నిర్ణీత వంద బంతుల్లోనే 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వెల్ష్ ఫైర్ బ్యాటింగ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో హెథర్ గ్రహమ్ (28 బంతుల్లో 35 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఆమెకు గ్రేస్ థాంప్సన్ (16), నిమ్హ్ హోలండ్ (12 నాటౌట్) సహకారం అందించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో టిల్లీ కోర్టీన్ 3 వికెట్లు తీయగా, ఇస్సీ వాంగ్ 2 వికెట్లు తీసింది. ఈ విజయంతో వెల్ష్ ఫైర్ 5 మ్యాచ్‌ల్లో రెండో విజయంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా, సదరన్ బ్రేవ్ ఓటమి పాలైనప్పటికీ టాప్‌లోనే కొనసాగుతోంది.#JemimahRodrigues showcases her trademark timing with a beautifully placed boundary! 💥#TheHundred 2026 👉 Welsh Fire vs Southern Brave | LIVE NOW! pic.twitter.com/8Y8tt9CPhe— Star Sports (@StarSportsIndia) August 3, 2026Read: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
హండ్రెడ్ టోర్నీలో స్మృతి మంధాన విధ్వంసం!
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన ప్రదర్శనతో అదరగొట్టింది. హండ్రెడ్ టోర్నీలో మంధాన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ వుమెన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం లండన్ వేదికగా ఎంఐ లండన్ వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 34 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) దనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించింది. మరో ఓపెనర్ అయిన కెప్టెన్ మెగ్ లానింగ్ (31 బంతుల్లో 43) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో ఎంఐ లండన్ విధించిన 93 పరుగుల టార్గెట్‌ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ వుమెన్స్ జట్టు 99 బంతుల్లో 92 పరుగులకు ఆలౌటైంది. కిరా ఛత్లీ (18), నికోలా కేరీ (17), చిన్నెల్లె హెన్రీ (16) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్‌డొనాల్డ్ మూడు వికెట్లు తీయగా, మైట్లన్ బ్రౌన్, సోఫి ఎసెల్‌స్టోన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌కు ఇది మూడో విజయం కాగా.. ఎంఐ లండన్ వుమెన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో సీజన్లో ఇప్పటివరకు ఖాతా తెరవని జట్టుగా ఎంఐ లండన్ వుమెన్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. Smriti Mandhana continuing her form and playing some spectacular shots pic.twitter.com/x19qUEPpXq— Nalin Kumar Awasthi (@cricnalin) August 2, 2026Read: యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు! -
క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరిసింది. గురువారం రాత్రి బర్మింగ్హమ్ ఫోనిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్లుగా నిలవగా, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన బర్మింగ్హమ్ మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంది. అయితే సదరన్ బ్రేవ్ విజయంలో జెమీమా మరోసారి కీలకపాత్ర పోషించింది. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా 18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జెమీమా తనకు వచ్చిన రెండో చాన్స్‌ను రెండు చేతులా ఒడిసిపట్టింది. మూడు ఫోర్లతో చివర్లో సదరన్ బ్రేవ్ భారీ స్కోరు చేయడంలో సహాయపడింది. ఒకవేళ జెమీమా ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు మయియా బౌచర్ (31 బంతుల్లో 45), లిజెల్లే లీ (28 బంతుల్లో 43) ధాటిగా ఆడారు. వీరిద్దరు ఔటైన తర్వాత జెమీమా (18 బంతుల్లో 28 నాటౌట్) అజేయంగా నిలిచింది. బర్మింగ్హమ్ బౌలర్లలో లారెన్ ఫైలర్, అలానా కింగ్, అలిస్ కాప్సీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డేవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) అర్ధసెంచరీ వృథాగా మారగా, టామీ బ్యూమౌంట్ (22) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మొలినెక్స్ రెండు వికెట్లు తీయగా, టిల్లీ కొర్టీన్, సారా గ్లెన్, లారెన్ బెల్లు తలా ఒక వికెట్ తీశారు. Never give #JemimahRodrigues a second chance! 🫣She powered three boundaries to wrap up the innings on a high for Southern Brave! ⚡#TheHundred 2026 👉 Southern Brave vs Birmingham Phoenix | LIVE NOW pic.twitter.com/KqBGgsVVen— Star Sports (@StarSportsIndia) July 30, 2026Read: రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్! -
జెమీమా విధ్వంసం.. పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం సృష్టించగా, సదరన్ బ్రేవ్స్ పరుగు తేడాతో ఎంఐ లండన్ జట్టుపై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 32, 3 ఫోర్లు), లారా వోల్వర్ట్ (30 బంతుల్లో 35, 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఓపెనర్ మయియా బౌచర్ (33 బంతుల్లో 31) రాణించింది. ఎంఐ లండన్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 4 వికెట్లు పడగొట్టగా, తారా నొర్రిస్, అమేలియా కెర్, నికోలా కేరీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ఎంఐ లండన్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. Photo Credit: Hundred Twitterఓపెనర్ డానీ వాట్హెడ్జ్ (42 బంతుల్లో 52 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయింది. మరో ఓపెనర్హేలీ మాథ్యూస్ (28 బంతుల్లో 32) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్ తలా ఒక వికెట్ తీశారు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకుంది.Photo Credit: Hundred Twitterహ్యాట్రిక్ పరాజయంఇక పురుషుల హండ్రెడ్ టోర్నీలో మాత్రం సదరన్ బ్రేవ్ జట్టు హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. సదరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ లండన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ జేక్ స్మిత్ (26 బంతుల్లో 49) పరుగు తేడాతో అర్ధసెంచరీ మిస్ చేసుకోగా, ట్రిస్టన్ స్టబ్స్ (31 బంతుల్లో 38) రాణించాడు. బౌల్ట్, టామ్ కరన్, రిచర్డ్ గ్లెసన్, సామ్ కరన్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఎంఐ లండన్ 100 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ విల్ జాక్స్ (41 బంతుల్లో 54) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. సామ్ కరన్ (30), రూథర్‌ఫోర్డ్ (21) ఆఖర్లో ధాటిగా ఆడారు. మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, నికిల్ చౌదరీ చెరొక వికెట్ పడగొట్టారు.విల్ జాక్స్ (Photo Credit: Hundred Twitter) The timing and placement from Jemimah Rodrigues 🤌#CricketTwitter pic.twitter.com/sdfSEc0UJP— Female Cricket (@imfemalecricket) July 27, 2026Read: సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్? -
హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. తాజాగా సదరన్ బ్రేవ్ జట్టు ప్లేయర్ జేమిమా రోడ్రిగ్స్ అజేయ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. విషయంలోకి వెళితే శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్, సదరన్ బ్రేవ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాని స్మిత్ (48), అనాబెల్ సదర్లాండ్ (22), దీప్తి శర్మ (23) రాణించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఇస్సీ వాంగ్ మూడు వికెట్లు తీయగా, టిల్లీ కొలెమన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం సదరన్ బ్రేవ్స్ 96 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జేమిమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో కాసిడి మెక్‌కార్తీ 2 వికెట్లు తీయగా, జెస్ జొనాసన్, అనాబెల్ సదర్లాండ్, డానియెల్లె గిబ్సన్ తలా ఒక వికెట్ తీశారు. మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లండన్‌పై వెల్ష్ ఫైర్ జట్టు 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ వుమెన్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సోఫి డివైన్ (52) అర్ధసెంచరీ సాధించగా, జార్జియా వోల్ (42), జార్జియా వర్హెమ్ (43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ లండన్ 92 బంతుల్లో 117 పరుగులకు కుప్పకూలింది. చినెల్లి హెన్రీ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గ్రేస్ పాట్స్ 3 వికెట్లు పడగొట్టింది. Ice in her veins! Jemimah Rodrigues closes out the chase 💫She delivers a memorable victory under pressure!#TheHundred 2026 👉 Sunrisers Leeds v Southern Brave pic.twitter.com/6YyTj5DWuM— Star Sports (@StarSportsIndia) July 25, 2026"Stay calm, stick to our plans, keep it simple and enjoy cricket" 🏏Hear from the Match Hero Jemimah Rodrigues after her fantastic knock to help Southern Brave beat Sunrisers Leeds 💯 pic.twitter.com/5aXY4eGnZ9— Sky Sports Cricket (@SkyCricket) July 25, 2026చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్! -
సిక్సర్లతో జట్టును గెలిపించిన భారత బ్యాటర్!
హండ్రెడ్ కాంపిటీషన్ 2026లో భారత మహిళా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత వికెట్‌కీపర్ రిచా ఘోష్ రెండు భారీ సిక్సర్లతో తన జట్టును విజయతీరాలకు చేర్చడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ రిచా ( 5 బంతుల్లో 15 నాటౌట్, రెండు సిక్సర్లు) ధాటికి 59 బంతుల్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మిగిలినవారిలో పేజ్ స్కోఫీల్డ్ (15 బంతుల్లో 22 నాటౌట్), మెగ్ లానింగ్ (24 బంతుల్లో 21) రాణించారు. అంతకముందు లండన్ స్పిరిట్ వుమెన్ 91 బంతుల్లో 80 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చార్లెట్ డీన్ (14), చారిస్ పవెలి (13) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్‌డొనాల్డ్ 4 వికెట్లతో సత్తా చాటింది.ఇక పురుషుల క్రికెట్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఏడు పరుగుల తేడాతో లండన్ స్పిరిట్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టిమ్ సిఫెర్ట్ (45 బంతుల్లో 67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లండన్ నైట్స్ 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 69 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. Power-hitting at its finest! 💥#RichaGhosh dispatches two massive sixes to power Manchester Super Giants to a comfortable win over London Spirit! 🔥#TheHundred 2026 👉 London Spirit vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/dMeQaYE6Ol— Star Sports (@StarSportsIndia) July 23, 2026Read: ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే!


