Photo Credit: Hundred Twitter
హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్‌లో సదరన్ బ్రేవ్ వుమెన్ తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం రాత్రి సదరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్‌తో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులుచేసింది.
లారా వోల్వర్ట్ (45 బంతుల్లో 48), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 25) రాణించారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో హెథర్ గ్రహమ్, గ్రేస్ పాట్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెల్ష్ ఫైర్ నిర్ణీత వంద బంతుల్లోనే 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వెల్ష్ ఫైర్ బ్యాటింగ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్‌లో హెథర్ గ్రహమ్ (28 బంతుల్లో 35 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఆమెకు గ్రేస్ థాంప్సన్ (16), నిమ్హ్ హోలండ్ (12 నాటౌట్) సహకారం అందించారు.
సదరన్ బ్రేవ్ బౌలర్లలో టిల్లీ కోర్టీన్ 3 వికెట్లు తీయగా, ఇస్సీ వాంగ్ 2 వికెట్లు తీసింది. ఈ విజయంతో వెల్ష్ ఫైర్ 5 మ్యాచ్‌ల్లో రెండో విజయంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా, సదరన్ బ్రేవ్ ఓటమి పాలైనప్పటికీ టాప్‌లోనే కొనసాగుతోంది.
#JemimahRodrigues showcases her trademark timing with a beautifully placed boundary! 💥#TheHundred 2026 👉 Welsh Fire vs Southern Brave | LIVE NOW! pic.twitter.com/8Y8tt9CPhe
— Star Sports (@StarSportsIndia) August 3, 2026


