source: X
కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ బాక్సర్ కుద్రతుల్లా (Qudratullah) మిస్ అయినట్లు తెలుస్తోంది. పోటీలు ముగిసిన అనంతరం టీమ్ హోటల్ నుంచి వెళ్లిన అతడు అదృశ్యమైనట్లు సమాచారం. అతని పాస్‌పోర్ట్ కూడా టీమ్ మేనేజర్ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే తొలిసారి కాదు
అంతర్జాతీయ టోర్నీల సమయంలో పాకిస్థాన్ బాక్సర్లు అదృశ్యమైన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ బర్మింగ్‌హామ్‌లో అదృశ్యమయ్యారు. అప్పట్లోనూ వారి పాస్‌పోర్టులు మేనేజర్ వద్దే ఉన్నట్లు సమాచారం.
2024లో ఇటలీలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ సందర్భంగా ఆసియా గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ జోహైబ్ రషీద్ (పాక్) తన రూమ్‌మేట్‌కు చెందిన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను తీసుకుని బస్టో అర్సిజియో పట్టణంలో అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి.
ఒక్క పతకంతో సరిపెట్టుకున్న పాక్
కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాక్‌కు ఒకే ఒక పతకం లభించింది. ఈ పోటీల్లో మొత్తం 36 మంది సభ్యులు పాల్గొనగా..మహిళల బాక్సింగ్‌లో ఫాతిమా జెహ్రా కాంస్య పతకాన్ని సాధించింది.


