ప్రీతి జింటాతో డేటింగ్.. ఎట్టకేలకు బ్రెట్‌ లీ రియాక్షన్ | Brett Lee breaks silence on Preity Zinta dating rumours | Sakshi
Sakshi News home page

Preity Zinta- Brett Lee: టీమ్ ఓనర్‌తో డేటింగ్.. బ్రెట్ లీ రియాక్షన్ ఇదే

Aug 4 2026 6:44 PM | Updated on Aug 4 2026 7:15 PM

Brett Lee breaks silence on Preity Zinta dating rumours

సినీ ఇండస్ట్రీలో డేటింగ్ అనే పదం కామన్. రిలేషన్, డేటింగ్ అంటూ సినీ తారలపై ఎప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అలా గతంలో బాలీవుడ్ భామ, ఐపీఎల్‌ పంజాబ్ టీమ్ ఓనర్ ప్రీతి జింటాపై కూడా చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్ లీతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. పంజాబ్ టీమ్‌లో బ్రెట్‌ లీ ఉన్న సమయంలో 2008లో వీరిద్దరి రిలేషన్‌ గురించి చర్చ నడిచింది.

ముంబయిలోని ఒక రెస్టారెంట్‌లో వీరిద్దరూ  జంటగా కనిపించడంతో ఈ వార్తలు అప్పట్లో ఊపందుకున్నాయి. ఆ తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌పై ప్రీతి జింటా స్పందించారు. ప్రతి ఏటా నాపై అలాంటి వార్తలు రావడం సాధారణమైపోయింది.. అందులో కొత్త విషయం ఏమీ  లేదంటూ కొట్టిపారేసింది. మేము కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చేసింది.

అయితే తాజాగా ఈ డేటింగ్ వార్తలపై  ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్ లీ స్పందించారు.  తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు. ఆమె పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని  స్పష్టం చేశారు. నేను ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమె పంజాబ్ జట్టుకు బాస్‌గా ఉండేవారని.. చాలా తెలివైన మహిళ అని కొనియాడారు. మాపై వచ్చిన అలాంటి కథనాలు నన్ను ఎప్పుడూ బాధించలేదని బ్రెట్‌ లీ అన్నారు. ప్రజలు ఎంతైనా ఊహించుకోవచ్చు.. కానీ అవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదని వెల్లడించారు.

ఇక ప్రీతి జింటా విషయానికొస్తే ఆమె 2016లో లాస్ ఏంజిల్స్‌లో జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట 2021లో సరోగసీ ద్వారా కవలలకు స్వాగతం పలికారు. ఇక ప్రీతి సినిమాల విషయానికొస్తే ఆమె 'బత్వారా 1947' చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.మరోవైపు బ్రెట్‌ లీ 2006లో ఎలిజబెత్ కెంప్‌ను వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత వీరిద్దరు 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన 2014లో లానా ఆండర్సన్‌ను వివాహం చేసుకున్నారు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement