మరోసారి దూకుడు.. రీ రిలీజ్ ‍ట్రైలర్ వచ్చేసింది | Mahesh Babu's Dookudu Re-Release Trailer Out Now: Celebrates Birthday on August 9 | Sakshi
Sakshi News home page

Dookudu Re Release Trailer: థియేటర్లలో దూకుడు.. రీ రిలీజ్ ‍ట్రైలర్ వచ్చేసింది

Aug 4 2026 6:15 PM | Updated on Aug 4 2026 6:27 PM

Mahesh Babu Dookudu Re Release Official Trailer out now

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలు బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేశాయి. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. మహేశ్ బాబు హీరోగా వచ్చిన దూకుడు ఆడియన్స్‌ను ఆలరించింది. 2011లో కేవలం రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు యాక్షన్‌, బ్రహ్మానందం-ఎమ్మెస్‌ నారాయణ కామెడీ ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా మెప్పించింది. మరోసారి వీరిద్దరిని బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయండి. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రంలో థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement