స్టార్‌ హీరోయిన్‌తో ఆర్జీవీ సీక్రెట్‌ పెళ్లి.. చిరంజీవినే చెప్పాడు | Did Ram Gopal Varma Secretly Marry Urmila Matondkar? | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌తో ఆర్జీవీ సీక్రెట్‌ పెళ్లి.. చిరంజీవినే చెప్పాడు : సీనియర్‌ జర్నలిస్ట్‌

Aug 4 2026 2:49 PM | Updated on Aug 4 2026 3:01 PM

Did Ram Gopal Varma Secretly Marry Urmila Matondkar?

ప్రముఖ సీనీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ(ఆర్జీవీ) పర్సనల్‌ గురించి గత మూడు, నాలుగు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్‌ హీరోయిన్‌ని ఆయన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడట. ఈ విషయాన్ని అప్పట్లో చిరంజీవినే మీడియాకు లీకు చేశాడని బాలీవుడ్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ జ్యోతి వెంకటేశ్ చెప్పారు. తాజాగా ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఆర్జీవీ సీక్రెట్‌ పెళ్లి గురించి చిరంజీవినే తనతో చెప్పాడని అన్నారు.

‘ఓ రోజు చిరంజీవి దగ్గరకు వెళ్తే.. 'హేయ్ జ్యోతి... ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుంది రాయలేదని చిరంజీవి నాతో అన్నారు. వారికి పెళ్లి ఎప్పుడు జరిగింది? అని నేను ఆయన్ను అడిగాను. ఆంధ్రప్రదేశ్‌ో ఓ ప్రముఖ ఆలయంలో ఊర్మిళను తీసుకెళ్లి ఆర్జీవీ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడిగాను. వారి పెళ్లి చేసిన పూజారి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. 

నేను ఆర్టికల్‌ రాయడానికి ముందే ఊర్మిళకు ఫోన్‌ చేశా. ఆమె ఏడుస్తూ.. ‘ నా గురించి మీరు అలా ఎలా రాస్తారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నా గురించి మీకు తెలుసు కదా’ అని అన్నారు. ఇదే విషయం ఆర్జీవీకి కాల్ చేస్తే 'నో కామెంట్' అని అన్నారు. దీంతో ఇద్దరి సైడ్ నుంచి స్టోరీ రాశాను’ అని జ్యోతి వెంకటేశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సీక్రెట్‌ పెళ్లిపై అటు ఊర్మిళా కనీ, ఇటు ఆర్జీవి కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ఆర్జీవీతో పెళ్లి జరిగిందో లేదో తెలియదు కానీ.. 2016 లో మోహ్సిన్ అక్తర్ మీర్ ని ఊర్మిళ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఊర్మిళ సింగిల్ గానే ఉంటుంది. అప్పట్లో ఆర్జీవీ, ఊర్మిళ కాంబో ఓ సంచలనం. వీరిద్దరి కాంబోలో వచ్చిన గాయం, రంగీలా, సత్య, అంతం, దౌడ్ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement