శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటా : ఎం.ఎస్‌ రాజు | M S Raju Talk About Agadha Movie | Sakshi
Sakshi News home page

శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటా : ఎం.ఎస్‌ రాజు

Aug 4 2026 11:17 AM | Updated on Aug 4 2026 11:49 AM

M S Raju Talk About Agadha Movie

‘‘ఇంతకుముందు నేను చేయని కథల్ని ఇప్పుడు ప్రయత్నించాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు గాలి సోకిందని కొన్ని రోజులు స్కూల్‌ మాన్పించారు. ఆ ఘటన నా మదిలో అలా ఉండిపోయింది. ‘అగధ’ సినిమా చేయడానికి ఇది కూడా ఒక కారణం. యూత్, జెన్‌  జీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉన్నా ఏడాదిలోనే షూటింగ్‌ పూర్తి చేశాం’’ అని ఎం.ఎస్‌ రాజు అన్నారు. 

ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌ కుమార్, భాను చందర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్‌ కేఆర్‌ సమర్పణలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. 

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు కేవీఎల్‌ఎన్‌  రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం.ఎస్‌ రాజు మాట్లాడుతూ–‘‘ఒక్కడు’ సినిమాకి మహేశ్‌ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’కి సిద్ధార్థ్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్‌ కిరణ్‌ కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యారు. అలా ‘అగధ’ కి ఇందులో నటించిన వారంతా కరెక్ట్‌గా సరిపోయారు. నాకు రిటైర్‌ అవడం ఇష్టం ఉండదు. నా శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement