సినిమా తారల గురించి నిజాలే కాకుండా ఒక్కోసారి అవాస్తవాలు ప్రచారం అవుతుంటాయి. అలా హీరోయిన్ ఆత్మిక గురించి రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. హిప్ హాప్ ఆది 'మిసై మురుక్కు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత కోటియిల్ ఒరువన్ చిత్రంలో విజయ్ ఆంటోనికి జంటగా నటించింది. కాటేరి , నరకాసురన్ తదితర చిత్రాల్లోనూ చేసింది. అనంతరం కారణాలు ఏమైనా గానీ సినిమాలు చేయట్లేదు.
ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పుకార్లు రావడంతో వాటిపై స్పందించింది. తనకు కలిగిన అనుభవాల్లో కొన్ని విషయాలను తాను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. అయితే అందులో నా భావాలను చూసిన కొందరు నేను ఏదో సమస్యలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. ఎవరికైనా ఏదో రకంగా ఉపయోగపడుతుందనే నేను నా అనుభవాలని వ్యక్తం చేస్తుంటాను.
ఇకపోతే మనం కోరుకున్న జీవితాన్ని ఎంచుకొని జీవించడం అంత సులభం కాదు. అందుకు చాలా ధైర్యం కావాలని నటి ఆత్మిక చెప్పుకొచ్చింది. చివరగా ఈమె 2023లో వచ్చిన తిరువిన్ కురళ్ అనే మూవీలో కనిపించింది.


