సూర్యతో ఉన్న తల్లీకూతుళ్లని గుర్తుపట్టారా? ఇద్దరూ నటులే | Actress Raveena Ravi Met Suriya After So Many Years, Shares Childhood Photos, Her Transformation Will Surprise You | Sakshi
Sakshi News home page

Guess The Actress: చిన్నప్పుడు అలా.. ఇన్నాళ్లకు మళ్లీ ఇలా

Aug 2 2026 9:06 PM | Updated on Aug 3 2026 10:42 AM

Actress Raveena Ravi Met Suriya After So Many Years

అప్పుడప్పుడు నటీనటులు షేర్ చేసుకునే పాత ఫొటోలు చిత్రంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే చిన్నప్పుడెప్పుడో సరదా కోసం స్టార్ హీరోహీరోయిన్లతో కొందరు పిక్స్ తీసుకుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత మళ్లీ వాళ్లని కలిసేసరికి తెగ ఆనందపడిపోతుంటారు. ఈ నటి అలాంటి అనుభూతి చెందింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)

పైన సూర్యతో కలిసున్న తల్లీకూతుళ్లు తమిళ సినిమాల్లో చేస్తున్న నటులే. పెద్దావిడ పేరు శ్రీజ. ఈమె సీనియర్ నటి. తమిళ, మలయాళంలో చాలానే మూవీస్ చేస్తోంది. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లోనూ నటించింది. ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈమె కూతురు, నటి రవీనా కూడా లొకేషన్‌కి వెళ్లింది. భర్తతో కలిసి సూర్యని కలవడంతో పాటు తన చిన్నప్పుడు కలిసి సందర్భాన్ని గుర్తుచేసుకుంది. తాజాగా ఈ రెండు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇకపోతే పాప పేరు రవీనా. 'లవ్ టుడే' మూవీలో ప్రదీప్ రంగనాథన్‌కి అక్కగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నటిగా ఫేమస్ అయింది కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్‌లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి.. ఓకే బంగారం, ప్రేమమ్(మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది ఈమెనే.

ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల నేపథ్య కథతో తీసిన సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్‌తో ప్రేమలో పడింది. ఈ ఏడాది మే నెలలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది.

(ఇదీ చదవండి: అలాంటి పాత్రలు చేయడం మానేశా.. కానీ రజనీకాంత్ కోసం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement