ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సినిమా | Idhayam Murali OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Idhayam Murali OTT: తమన్ నటించిన మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Aug 2 2026 7:28 PM | Updated on Aug 2 2026 7:30 PM

Idhayam Murali OTT Release Date Latest Update

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ అలా బాలన్, గట్ట కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, రావు బహదూర్, సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, దీవాన, హై జవానీ తో ఇష్క్ హోనా హై తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే ఇప్పుడో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)

అధర్వ, తమన్, ఫహాద్ ఫాజిల్, నిహారిక ఎన్ఎమ్, ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'ఇదయం మురళి'. తెలుగులో దీన్ని 'హృదయం మురళి' పేరుతో గత నెల 10వ తేదీన రిలీజ్ చేశారు. ప్రేమకథతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ శుక్రవారం(ఆగస్టు 07) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

'హృదయం మురళి' విషయానికొస్తే.. హృదయ(అధర్వ) అనే కుర్రాడు మామయ్య దగ్గర పెరుగుతాడు. స్కూల్‌లో ఉన్నప్పుడు గీత టీచర్(జోనితా గాంధీ), ట్యూషన్‌లో సమంత (ప్రీతి ముకుందన్‌), కాలేజీ టైంలో అముద (కయాదు)ని ‍ప్రేమిస్తాడు. కానీ ఒక్కరికీ తన ప్రేమని వ్యక్తపరచలేకపోతాడు. అదితి (మాళవిక మోహనన్‌)ని పెళ్లి చేసుకోవడానికి మరో పదిరోజులు ఉందనగా తన మనసులో ఉండిపోయిన ప్రేమని వ్యక్తపరిచేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి న్యూయార్క్‌ వెళ్తాడు. తర్వాత ఏమైంది? సమంత, అముద, అదితిల్లో ఎవరిని పెళ్లాడాడు? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: పూజా హెగ్డే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement