breaking news
Preity Mukhundhan
-
ట్రెండింగ్ బ్యూటీస్ గ్లామర్.. లుక్ మార్చిన హీరో కూతురు
అందంగా ట్రెండింగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్సరికొత్త లుక్‌లో మాయ చేస్తున్న ప్రీతి ముకుందన్స్టైల్ మార్చిన హీరో రాజశేఖర్ కూతురు శివాత్మికబ్లాక్ డ్రస్‌లో ఓర చూపులతో కృతిశెట్టి రచ్చ'విశ్వనాథ్ అండ్ సన్స్' జ్ఞాపకాలతో భవానీ శ్రీఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫొటోలతో కీర్తి సురేశ్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) View this post on Instagram A post shared by Tejaswi. (@tej_aswiii) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ అలా బాలన్, గట్ట కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, రావు బహదూర్, సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, దీవాన, హై జవానీ తో ఇష్క్ హోనా హై తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే ఇప్పుడో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)అధర్వ, తమన్, ఫహాద్ ఫాజిల్, నిహారిక ఎన్ఎమ్, ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'ఇదయం మురళి'. తెలుగులో దీన్ని 'హృదయం మురళి' పేరుతో గత నెల 10వ తేదీన రిలీజ్ చేశారు. ప్రేమకథతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ శుక్రవారం(ఆగస్టు 07) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'హృదయం మురళి' విషయానికొస్తే.. హృదయ(అధర్వ) అనే కుర్రాడు మామయ్య దగ్గర పెరుగుతాడు. స్కూల్లో ఉన్నప్పుడు గీత టీచర్(జోనితా గాంధీ), ట్యూషన్లో సమంత (ప్రీతి ముకుందన్), కాలేజీ టైంలో అముద (కయాదు)ని ప్రేమిస్తాడు. కానీ ఒక్కరికీ తన ప్రేమని వ్యక్తపరచలేకపోతాడు. అదితి (మాళవిక మోహనన్)ని పెళ్లి చేసుకోవడానికి మరో పదిరోజులు ఉందనగా తన మనసులో ఉండిపోయిన ప్రేమని వ్యక్తపరిచేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి న్యూయార్క్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? సమంత, అముద, అదితిల్లో ఎవరిని పెళ్లాడాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పూజా హెగ్డే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి?) -
మాల్దీవుల్లో తెలుగు బ్యూటీ.. ప్రీతి ముకుందన్ స్మైల్
మాల్దీవులు ట్రిప్ వేసిన తెలుగమ్మాయి శాన్వీపచ్చని డ్రస్‌లో రాశీ సింగ్ అందాల జాతరనవ్వుతూ మాయ చేస్తున్న ప్రీతి ముకుందన్మంచులో ఎంజాయ్ చేస్తున్న ప్రియా వారియర్'లెనిన్' షూటింగ్ మర్చిపోలేకపోతున్న భాగ్యశ్రీవైరల్ పాటకు ఆషికా రంగనాథ్ సూపర్ డ్యాన్స్ View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Jone Kingston (@jonekingston) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ (ఫొటోలు)
-
ట్రెండింగ్ హీరోయిన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?
మన దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. ఈయన గణిత సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈయన ఘనతలు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అయితే పుట్టినరోజు, వర్ధంతి లాంటివి ఇప్పుడేం లేవు అయినా సరే శ్రీనివాస రామానుజన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతున్నారు. దీనికి కారణం. లేటెస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఈయనకు మునిమనవరాలు అవుతుందనే వార్త.(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్‌కి లక్కీ ఛాన్స్)తమిళనాడులోని ఈరోడ్‌లో 1887లో పుట్టిన శ్రీనివాస రామానుజన్ 32 ఏళ్లకే మశూచి వ్యాధి బారినపడి చనిపోయారు. ఇదంతా జరగడానికి చాన్నాళ్ల క్రితమే జానకి అమ్మళ్ అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్లకు ఎలాంటి సంతానం లేదు. కానీ గత రెండు రోజుల నుంచి హీరోయిన్ ప్రీతి ముకుందన్ తల్లికి శ్రీనివాస రామానుజన్తో బంధుత్వం ఉందని, తద్వారా ప్రీతి, రామానుజన్‌కి ముని మనవరాలు అవుతుందని అంటున్నారు.కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని అనిపిస్తుంది. శ్రీనివాస రామానుజన్ చనిపోయిన ముప్పై ఏళ్ల తర్వాత జానకి అమ్మళ్.. డబ్ల్యూఎస్ నారాయణ్ అనే వ్యక్తిని పెంచుకుందని చెప్పి గూగుల్‌లో ఉంది. బహూశా ఈయన తర్వాత తరం వాళ్లతో ప్రీతి ముకుందన్ కుటుంబానికి ఏమైనా బంధుత్వం ఉంటే ఉండాలి. ఒకవేళ ఉన్నాగానీ ఈ విషయం గురించి ప్రీతి స్పందిస్తే తప్పితే ఏదో ఒకటి క్లారిటీ రాదు.ప్రీతి ముకుందన్ విషయానికొస్తే.. ఓం భీం బుష్, కన్నప్ప లాంటి తెలుగు సినిమాలు చేసింది గానీ ఈమెకు సక్సెస్ రాలేదు. తమిళంలో ఈ ఏడాది వచ్చిన 'బ్లాస్ట్' ఈమె ఫేట్ మార్చింది. ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్‌కి లక్కీ ఛాన్స్
వరస సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డాన్సర్, మోడల్ అయిన ఈ తిరుచిరాపల్లి బ్యూటీ 'ఓం భీమ్ బుష్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. అది ఓకే అనిపించుకుంది. తర్వాత తెలుగులోనూ మంచు విష్ణు 'కన్నప్ప'లో నటించింది గానీ అందాల ఆరబోత తప్పితే మరేం చేయలేదు. అనంతరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె ఫేట్ మారిపోయింది.(ఇదీ చదవండి: తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం)అర్జున్, అభిరామితో కలిసి ఈమె నటించిన 'బ్లాస్ట్' సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రీసెంట్గా 'ఇదయం మురళి'తో వచ్చింది. ప్రస్తుతం 'దశమకన్' అనే తమిళ చిత్రంతో పాటు మలయాళ ఒకటి, హిందీలో 'నాగ్ జిల్లా'మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. నటిగా రంగప్రవేశం చేసిన రెండేళ్లలోనే పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కోలీవుడ్‌లోనే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.ధనుష్ 56వ చిత్రంలో హీరోయిన్గా చేసే అవకాశం ప్రీతిని వరించినట్లు తెలుస్తోంది. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్ మారి ముత్తు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో తొలుత రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె తెలుగులో ఎన్టీఆర్ 'డ్రాగన్'తో బిజీగా ఉన్న కారణంగా ధనుష్‌తో నటించలేని పరిస్థితి. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్‌ను వరించినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ధనుష్ ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం'లో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!) -
వైట్ శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
-
'హృదయం మురళి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన ప్రీతి ముకుందన్ (ఫొటోలు)
-
ఓటీటీలోకి తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఓ తమిళ యాక్షన్ మూవీ సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ)యాక్షన్ హీరో అర్జున్, అభిరామి, ప్రీతిముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. తమిళ, తెలుగులో హిట్ అనిపించుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే గురువారం(జూన్ 25) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్) మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు(అర్జున్, అభిరామి)తో కలిసి ఉంటుంది. వీళ్లంతా కరాటే మాస్టర్లే. నీల తండ్రి ఓవైపు మెడికల్ షాప్ నడుపుతూనే మరోవైపు పిల్లలకు ఫ్రీగా కరాటే నేర్పిస్తుంటాడు. నీల ఓ రోజు షాపులో ఉండగా కృపాకర్ గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ వచ్చి ఈమెని బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే నీల చేతిలో చావుదెబ్బలు తిని జైలుపాలవుతాడు. దీంతో కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. తర్వాత ఏమైంది? అసలు కృపాకర్ గ్యాంగ్.. నీల కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?) -
శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
-
ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా
ఒకప్పుడు హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన అర్జున్ సర్జా ఇప్పుడు సహాయ పాత్రలే దాదాపుగా చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'సీతా పయనం' అనే తెలుగు మూవీతో దర్శకుడిగానూ ఓ ప్రయత్నం చేశాడు గానీ అస్సలు వర్కౌట్ కాలేదు. అలాంటి ఇతడు హీరోగా నటించిన ఓ చిత్రం ఇప్పుడు థియేటర్లలో అదరగొడుతోంది. కలెక్షన్స్ కూడా అలానే వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన తమిళ సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో దీన్ని 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. లీడ్ రోల్స్ చేసిన ఎవరూ కూడా పెద్ద స్టార్స్ ఏం కాదు. ప్రమోషన్స్ కూడా సాధారణంగా చేసి వదిలేశారు. కానీ మూవీలో కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో అర్జున్‌తో పాటు అభిరామి, ప్రీతి చేసే ఫైట్ సీక్వెన్స్ సూపర్ అని మెచ్చుకుంటున్నారు.ఇలా మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు రూ.25.26 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పెద్దగా స్టార్స్ లేని ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే అది హిట్ కిందే లెక్క. ఈ నంబర్స్ చూసిన చాలామంది అర్జున్ మార్కెట్ ఇంకా బతికే ఉందా అని మాట్లాడుకుంటున్నారు. సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా.(ఇదీ చదవండి: సుస్మితా సేన్ దగ్గరే ఎక్కువ వజ్రాలు.. నా ఖర్చులు ఆమెనే భరించేది) -
'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. అర్జున్ సినిమా కావడంతో టాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రాజారామన్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. ఆయన సతీమణి నీలవేణి(అభిరామి), కూతురు నీల(ప్రీతి ముకుందన్)తో పాటు కుటుంబ సభ్యులంతా మార్షన్ ఆర్ట్స్‌లో నిపుణులు. ఒకపక్క కరాటే శిక్షణ ఇస్తూనే మరోపక్క మెడికల్ షాపు రన్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంటారు. తనతో దురుసుగా ప్రవర్తించే మగాళ్లను చితకబాదుతూ.. తల్లితో తింట్లు తింటుంది నీల. కూతురుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నీలవేణి ప్లాన్ చేస్తుండగా.. అనుకోకుండా ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్‌తో శత్రుత్వం ఏర్పడుతుంది. వారి వెనుక బడా వ్యాపారవేత్త వరుణ్ దయాల(జాన్ కొక్కెన్) ఉంటాడు. ఓ ఇల్లీగల్ బిజినెస్ డీల్ కోసం అతను మంత్రికి లంచంగా ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లు చేరాల్సిన చోటుకి చేరకుండా పరోక్షంగా రాజారామన్ ఫ్యామిలీ అడ్డుకుంటుంది. దీంతో వరుణ్ దయాల మనుషులు కూడా రాజా రామన్ ఫ్యామిలీని చంపేందుకు ప్లాన్ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి రాజారామన్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? రూ. 1000 కోట్ల లంచం వెనుక ఉన్న రూ. 7000 కోట్ల ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షన్ ఆర్ట్స్ శిక్షణతో అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని రాజా రామన్ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సమాజంలో అన్యాయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే సందేశం ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి లేదు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత పెద్దగా బోర్ కొట్టదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. అలాగే కథనం చాలా వరకు ఊహకందేలా సాగుతుంది. అయితే కొన్ని కథల విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసినా.. దాన్ని తెరపై ఎలా ప్రజెంట్ చేస్తాడనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుడిలో కలుగుతుంది. తాను ఊహించినట్లుగానే ఆయా సన్నివేశాలు సాగితే.. కథతో మరింత కనెక్ట్ అవుతాడు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఊహించినట్లుగానే కథనం సాగినా.. ఆసక్తి మాత్రం తగ్గదు. బోర్ కొడుతుందని ప్రేక్షకుడు ఫీలయ్యేలోపు ఓ భారీ యాక్షన్ సీన్‌తో పాటు ప్రతి పాత్రకు ఎలివేషన్ ఇచ్చి కథతో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు.సినిమా ప్రారంభంలో రాజారామన్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు రాజారామన్ ఫ్యామిలీ స్టోరీని, మరోవైపు రౌడీ వ్యాపారవేత్త వరుణ్ దయాల్ రూ. 7000 కోట్ల బిజినెస్ డీల్‌ని చూపిస్తూ కథనం నడిపించి ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచేశాడు. ఈ రెండు కథలకు మధ్య సంబంధం ఉంటుందని ప్రేక్షకుడు ఊహించినా.. ఎలా ముడిపెడతాడనే ఆసక్తి మాత్రం ఫస్టాఫ్ అంతా కొనసాగుతుంది. ఫ్యామిలీ సీన్లు రొటీన్‌గానే ఉన్నా.. ప్రతీ ముకుందన్ చేసే యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్‌కి ముందు ఇంట్లో అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి చేసే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ బ్లాస్ట్ బాగుంటుంది. ఇక ద్వితియార్థంలో అర్జున్ ఫ్యామిలీ.. రౌడీలను ఎలా ఎదుర్కొన్నాడనేదే ఉంటుంది. కథనం ఊహకందేలా సాగినా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ముగింపు రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా చేసిన యాక్షన్ సినిమా ఇది. రాజారామన్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. కొన్ని చోట్ల వింటేజ్ అర్జున్‌ని చూస్తారు. ఇక ఇన్నాళ్లు కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం అయిన ప్రీతి ముకుందన్, అభిరామి.. ఇందులో యాక్షన్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన హై-ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సులు సినిమాకు కొత్తదనం తెచ్చాయని చెప్పొచ్చు. వరుణ్ దయాల్‌గా జాన్ కొక్కేన్, అబ్రహాంగా అర్జున్ చిదంబరం, కిరుబకరన్‌గా పవన్ కృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


