రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్‌కి లక్కీ ఛాన్స్ | Preethi Mukundan Replaces Rukmini Vasanth? Actress Reportedly Roped In For Dhanush 56th Movie, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Preity Mukundan: క్రేజీ అవకాశం కొట్టేసిన 'బ్లాస్ట్' బ్యూటీ

Jul 17 2026 8:47 AM | Updated on Jul 17 2026 10:38 AM

Preity Mukundan In Dhanush New Movie

వరస సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డాన్సర్‌, మోడల్‌ అయిన ఈ తిరుచిరాపల్లి బ్యూటీ 'ఓం భీమ్‌ బుష్‌' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. అది ఓకే అనిపించుకుంది. తర్వాత తెలుగులోనూ మంచు విష్ణు 'కన్నప్ప'లో నటించింది గానీ అందాల ఆరబోత తప్పితే మరేం చేయలేదు. అనంతరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె ఫేట్ మారిపోయింది.

(ఇదీ చదవండి: తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం)

అర్జున్‌, అభిరామితో కలిసి ఈమె నటించిన 'బ్లాస్ట్‌' సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రీసెంట్‌గా 'ఇదయం మురళి'తో వచ్చింది. ప్రస్తుతం 'దశమకన్'‌ అనే తమిళ చిత్రంతో పాటు మలయాళ ఒకటి, హిందీలో 'నాగ్‌ జిల్లా'మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. నటిగా రంగప్రవేశం చేసిన రెండేళ్లలోనే పాన్‌ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కోలీవుడ్‌లోనే మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు సమాచారం.

ధనుష్‌ 56వ చిత్రంలో హీరోయిన్‌గా చేసే అవకాశం ప్రీతిని వరించినట్లు తెలుస్తోంది. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్‌ మారి ముత్తు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని డాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇందులో తొలుత రుక్మిణి వసంత్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె తెలుగులో ఎన్టీఆర్‌ 'డ్రాగన్'తో బిజీగా ఉన్న కారణంగా ధనుష్‌తో నటించలేని పరిస్థితి. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్‌ను వరించినట్లు టాక్‌. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ధనుష్‌ ప్రస్తుతం రాజ్‌ కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం'లో నటిస్తున్నాడు. 

(ఇదీ చదవండి: విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement