ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా | Blast movie collection worldwide | Sakshi
Sakshi News home page

Blast Movie: ‍క్రేజీ సినిమాకు అద్భుతమైన వసూళ్లు

Jun 2 2026 11:08 AM | Updated on Jun 2 2026 12:38 PM

Blast movie collection worldwide

ఒకప్పుడు హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన అర్జున్ సర్జా ఇప్పుడు సహాయ పాత్రలే దాదాపుగా చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'సీతా పయనం' అనే తెలుగు మూవీతో దర్శకుడిగానూ ఓ ప్రయత్నం చేశాడు గానీ అస్సలు వర్కౌట్ కాలేదు. అలాంటి ఇతడు హీరోగా నటించిన ఓ చిత్రం ఇప్పుడు థియేటర్లలో అదరగొడుతోంది. కలెక్షన్స్ కూడా అలానే వస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన తమిళ సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో దీన్ని 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. లీడ్ రోల్స్ చేసిన ఎవరూ కూడా పెద్ద స్టార్స్ ఏం కాదు. ప్రమోషన్స్ కూడా సాధారణంగా చేసి వదిలేశారు. కానీ మూవీలో కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో అర్జున్‌తో పాటు అభిరామి, ప్రీతి చేసే ఫైట్ సీక్వెన్స్ సూపర్ అని మెచ్చుకుంటున్నారు.

ఇలా మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు రూ.25.26 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పెద్దగా స్టార్స్ లేని ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే అది హిట్ కిందే లెక్క. ఈ నంబర్స్ చూసిన చాలామంది అర్జున్ మార్కెట్ ఇంకా బతికే ఉందా అని మాట్లాడుకుంటున్నారు. సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్‌ (పవన్‌) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్‌ తర్వాత కృపాకర్‌ గ్యాంగ్‌తో పాటు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అబ్రహం (అర్జున్‌ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా.

(ఇదీ చదవండి: సుస్మితా సేన్ దగ్గరే ఎక్కువ వజ్రాలు.. నా ఖర్చులు ఆమెనే భరించేది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement