ఐపీఎల్ ముగిసింది. ఈ లీగ్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త అయిన లలిత్ మోడీ మాత్రం ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సూర్యవంశీ గురించి మాట్లాడాడు. గతంలో ఇతడు బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. అయితే డబ్బు కోసమే లలిత్‌కి ఈమె దగ్గరైందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వాటిని ఖండించాడు. ఈ క్రమంలోనే సుస్మితా గురించి ఇతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా అనిపించాయి.
(ఇదీ చదవండి: బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా)
'సుస్మితా సేన్ కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గరే ఎక్కువ వజ్రాలున్నాయి. వాటన్నింటినీ ఆమెనే స్వయంగా సంపాదించుకుంది. మేం కలిసున్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు ఆమెనే ఖర్చులన్నీ చెల్లించేది. నేనే ఆమె డబ్బులపై ఆధారపడ్డాను. ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించడానికి ఇష్టపడదు. ఆమె గురించి తెలియని వాళ్లు మాత్రమే అలాంటి ఆరోపణలు చేస్తారు' అని లలిత్ మోడీ క్లారిటీ ఇచ్చాడు.
సుస్మితాతో బంధం గురించి మాట్లాడిన లలిత్ మోడీ.. 'సుస్మితా నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆమె ఎంతో సాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం' అని చెప్పుకొచ్చాడు. 2022లో సుస్మితాతో డేటింగ్‌లో ఉన్నట్లు తనకు తానుగా ప్రకటించుకున్న లలిత్ మోడీ.. తర్వాత బ్రేకప్ అయినట్లు కూడా చెప్పాడు. గతేడాది మరో మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు లలిత్ పోస్ట్ పెట్టాడు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం వదలి పారిపోయిన ఇతడు 2010 నుంచి లండన్‌లో ఉంటున్నాడు.
(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోయిన్ శివానీ నాగారంకి బంపరాఫర్)


