తెలుగు యంగ్ హీరోయిన్‌కి బంపరాఫర్ | Shivani Nagaram Tamil Debut With Abishan Jeevinth Movie | Sakshi
Sakshi News home page

చిన్న హీరోతో 'పెద్ది' నటుడు.. హీరోయిన్‌గా తెలుగమ్మాయి

Jun 2 2026 9:14 AM | Updated on Jun 2 2026 9:23 AM

Shivani Nagaram Tamil Debut With Abishan Jeevinth Movie

కన్నడలో స్టార్ హీరో అయినప్పటికీ 'పెద్ది'లో కీలక పాత్రలో నటించిన శివరాజ్ కుమార్.. ఇప్పుడు తమిళంలో చిన్న హీరో అయిన అభిషన్ మూవీలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా హిట్ కొట్టిన అభిషన్ జీవింత్.. 'విత్ లవ్'తో హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొత్త చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది.

(ఇదీ చదవండి: చరణ్ ఇంత కష్టపడ్డాడా? 'పెద్ది' క్రేజీ సాంగ్ వీడియో రిలీజ్)

బాలమురుగన్‌.ఏ నిర్మిస్తున్న ఈ సినిమాతో గౌతమ్‌ శివరామ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివాని నాగారం ఈ చిత్రంతో తమిళంకి ఎంట్రీ ఇస్తోంది. అలానే 'టూరిస్ట్‌ ఫ్యామిలీ' ఫేమ్‌ యోగలక్ష్మీ మరో హీరోయిన్. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గానా వినోద్‌, సంగీత మాధవన్‌, బెంజిమిన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ చైన్నెలో జరుగుతోందని, చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు టీమ్ చెప్పింది.

లిటిల్ హార్ట్స్, హే బల్వంత్ తదితర తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న శివానీ నాగారం.. ఇప్పుడు తమిళంలో ఎంట్రీతోనే అభిషన్, శివరాజ్ కుమార్ లాంటి పేరున్న యాక్టర్స్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇది గనక క్లిక్ అయితే ఈమె దశ తిరగడం గ్యారంటీ. ఎందుకంటే శ్రీదివ్య, అంజలి, బిందుమాధవి, ఆనంది లాంటి తెలుగమ్మాయిలు తమిళంలో వరస సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

(ఇదీ చదవండి: బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement