చరణ్ ఇంత కష్టపడ్డాడా? 'పెద్ది' క్రేజీ సాంగ్ | Peddi Movie Massa Massa Song Video | Sakshi
Sakshi News home page

Peddi Song: 'మస్సా మస్సా' వీడియో సాంగ్ రిలీజ్

Jun 2 2026 8:48 AM | Updated on Jun 2 2026 8:54 AM

Peddi Movie Massa Massa Song Video

'పెద్ది' మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. రేపు(జూన్ 03) రాత్రికి ప్రీమియర్లు పడబోతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి విజయవాడలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే మూవీలో క్రేజీ సాంగ్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. రామ్ చరణ్.. అథ్లెట్‌లా కనిపించేందుకు ఎంతలా కష్టపడ్డారో ఈ పాటలో చూపించారు.

(ఇదీ చదవండి: బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా)

'మస్సా మస్సా' అంటూ సాగే ఈ గీతానికి సంబంధించి కొన్నిరోజుల ముందు కేవలం ఆడియోని రిలీజ్ చేశారు. ఇప్పుడు లిరికల్ వీడియోని కూడా వదిలారు. ఇందులో కుస్తీ వీరుడిగా ఎంతలా కష్టపడ్డాడు? చెమటోడ్చాడు అనేది ఇందులో చూపించారు. ఇకపోతే ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.

(ఇదీ చదవండి: అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్‌చరణ్‌)

Advertisement
 
Advertisement
Advertisement