బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా | Raashi Khanna About Crash Diet And Weight Loss Tips | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల వయసొచ్చేసరికి ఆ విషయం తెలుసుకున్నా

Jun 2 2026 8:34 AM | Updated on Jun 2 2026 8:41 AM

Raashi Khanna About Crash Diet And Weight Loss Tips

మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. అందం కూడా ముఖ్యమే. అందం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే సహజసిద్ధంగా వచ్చే సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి తపన పడుతుంటారు. సినీ తారలకు అందం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ప్రతిభను పక్కన పెడితే అందమే వారికి కీలకం. అందుకే నిత్యం శరీరానికి అవసరమైన ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, శారీరక వ్యాయామాలు చాలా అవసరం. 20 ఏళ్ల వయసులో అందంగా ఉండడం పెద్ద విషయం కాదు. అయితే 30 ఏళ్ల తరువాత ఎదురయ్యే రోగాలతో శక్తి తగ్గడం వంటి విషయాల్లో జాగ్రత్త వహించడం పెద్ద విషయం. 30 ఏళ్ల తరువాత మనం ఎలా అరోగ్యంగా ఉండాలన్న విషయాలను వైద్యులు, వ్యాయామ నిపుణులు సూచనలు చేస్తుంటారు. అదే విధంగా ఫిట్‌నెస్‌ విషయంలో సినీ ప్రముఖులు సలహాలు ఇస్తుంటారు. నిత్యం కసరత్తులు చేసే వారిలో నటి రాశీఖన్నా ఒకరు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఈ 35 ఏళ్ల బ్యూటీ.. హిందీ, తెలుగు, తమిళంలో నటిస్తూ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ బ్యూటీ తమిళంలోకి 'ఇమైకా నొడిగళ్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. నటిగా పుష్కరం పూర్తి చేసుకున్న రాశీఖన్నా.. ప్రస్తుతం తమిళంలో 'రౌడీ అండ్‌ కో'లో నటిస్తోంది. హిందీలోనూ రెండు చిత్రాలు చేస్తున్న ఈమె.. ఇటీవల అందం, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ 20 ఏళ్ల వయసులో అందానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే దాన్ని అని చెప్పుకొచ్చింది. 30 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండడటమే ముఖ్యం అని తెలుసుకున్నానని పేర్కొంది. అందంగా ఉండడం మంచిదే కానీ, బరువు తగ్గాలనుకునే మహిళలు ప్రమాదకరమైన క్రాష్‌ డైట్‌ విధానాలను పక్కన పెట్టాలని పేర్కొంది. తమని ఇతరులతో పోల్చుకోకుండా పౌష్టికాహారం తీసుకుంటూ రూల్స్ పాటిస్తూ వ్యాయామాలు చేయాలని రాశీఖన్నా సలహా ఇచ్చింది.

ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తర్వాత బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర సినిమాలు చేసింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండే ఈమె.. ఇప్పుడు నాజుగ్గా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement