ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ | Upcoming OTT Movies Telugu June First Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లోకి ఒక్కవారంలో 19 మూవీస్.. మరి థియేటర్లలో?

Jun 1 2026 11:57 AM | Updated on Jun 1 2026 7:46 PM

Upcoming OTT Movies Telugu June First Week 2026

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రామ్ చరణ్ 'పెద్ది' రాబోతుంది. గురువారం రిలీజ్ కానుండగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్ల పడనున్నాయి. మృణాల్, పూజా హెగ్డే నటించిన హిందీ మూవీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఈ వీకెండే రానుంది. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'ధురంధర్ 2' స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంది. దీనితో పాటు పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక తదితర తెలుగు డబ్బింగ్ మూవీస్ చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మేడిన్ ఇండియా, ద పిరమిడ్ స్కీమ్, బ్రౌన్ లాంటి సిరీసులు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీకి ఏ మూవీ రానుందంటే?

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (జూన్ 01 నుంచి 07 వరకు)

హాట్‌స్టార్

  • ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04

అమెజాన్ ప్రైమ్

  • మేడిన్ ఇండియా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 03

  • క్లార్క్‌సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03

  • ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03

  • ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05

నెట్‌ఫ్లిక్స్

  • మా బెహన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04

  • ద మర్డర్ ఆఫ్ రేచల్ నికల్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 04

  • 29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05

  • మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05

  • ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05

  • టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05

  • ద మార్క్‌డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05

  • యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07

జీ5

  • పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05

  • కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05

  • బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05

సోనీ లివ్

  • గులక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05

సన్ నెక్స్ట్

  • ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05

ఆపిల్ టీవీ ప్లస్

  • కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04

(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement