పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ | Sobhita Dhulipala First Look From Pa Ranjith Movie | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: సైన్స్ ఫిక్షన్ మూవీ.. శోభిత లుక్ ఇలా

May 31 2026 7:47 PM | Updated on May 31 2026 7:47 PM

Sobhita Dhulipala First Look From Pa Ranjith Movie

హీరోయిన్ శోభిత.. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం మానేస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. కాకపోతే ఈమె నటించిన 'చీకటిలో' మూవీ నేరుగా ఓటీటీలో రిలీజైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. వివాహం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)

శోభిత తెలుగమ్మాయి అయినప్పటికీ హిందీ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలోనూ పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ తీస్తున్న 'వెట్టువం' అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో శోభిత లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఫొటో రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించింది.

(ఇదీ చదవండి: చైతూతో పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి శోభిత కామెంట్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement