హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ్ల.. అక్కినేని ఇంటి కోడలు అయిపోయింది. అయితే 2024 డిసెంబరులో వివాహం జరిగిన టైంలో వీళ్ల గురించి సోషల్ మీడియాలో చాలా మాట్లాడుకున్నారు. ఎందుకంటే చైతూ అప్పటికే సమంతని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశాడు. దీంతో చైతూ-శోభిత పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది. ఆ టైంలో వచ్చిన కామెంట్స్, డిస్కషన్ గురించి ఇప్పుడు శోభిత స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి మాట్లాడింది.
(ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)
వ్యక్తిగత జీవితంపై వస్తున్న విపరీతమైన అటెన్షన్ నుంచి ఎలా దూరంగా ఉంటారనే ప్రశ్నకు బదులిచ్చిన శోభిత.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఇలాంటి పరిస్థితులన్నీ నాకు చాలా విషయాలు నేర్పించాయి. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో కొంత ఆసక్తి ఉండటం సహజం. అయితే నేను నాకు నచ్చినట్లు బతుకుతున్నా. నా నుంచి జనాలు ఏం ఆశిస్తున్నారో నాకు తెలీదు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను. నాపై వచ్చే డిఫరెంట్ అభిప్రాయాల మధ్య కూడా స్థిరంగా ఉండగలను'
'ఇప్పుడు ప్రతి విషయంపై సమాజంలో చాలా చర్చ నడుస్తంది. ఇదంతా వాతావరణం లాంటిది. సమాజంలోనూ వెదర్ ఉంటుంది. దీన్ని మనం అంత సీరియస్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవేవి శాశ్వతం కాదు. వాతావరణం మారినట్లు సమాజంలో మన గురించి చర్చ కూడా మారిపోతుంది' అని శోభిత చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే చైతూతో పెళ్లి టైంలో వచ్చిన ట్రోల్స్ లాంటివి అస్సలు పట్టించుకోలేదనమాట.
శోభిత ప్రస్తుతం తమిళంలో 'వెట్టువం' అనే సినిమా చేస్తోంది. పా.రంజిత్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో దీన్ని తీస్తున్నారు. నాగచైతన్య విషయానికొస్తే 'వృషకర్మ' చిత్రం చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)


