రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య | Suriya Gifts Mahindra B6 Ev Car To Karuppu Cinematographer GK Vishnu, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Suriya Car Gift: ఆనందం పట్టలేకపోతున్న సూర్య.. బహుమతిగా కారు

May 31 2026 3:14 PM | Updated on May 31 2026 6:00 PM

Suriya Gifts Mahindra B6 Ev Car Karuppu Cinematographer Gk Vishnu

సక్సెస్ ఉన్నడినే అందరూ గుర్తుపెట్టుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటేనే మార్కెట్ బాగుంటుంది. సినిమాలకు కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అలా చాలా ఏళ్ల తర్వాత 'కరుప్పు' మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో హీరో సూర్య ఆనందం పట్టలేకపోతున్నాడు. చిత్ర యూనిట్‌కి కార్లని బహుమతిగా ఇస్తున్నాడు.

(ఇదీ చదవండి: అప్పుడు ‘పెద్ది’ నుంచి తప్పుకోవాలనుకున్నా : శివరాజ్‌కుమార్‌)

సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేశారు. మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది గానీ పర్లేదనిపించే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది.

ఇకపోతే ఈ సినిమాలో తనని అద్భుతంగా చూపించినందుగానూ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకి మహీంద్ర బీ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని సూర్య బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని విష్ణు తన ఇన్ స్టాలో వెల్లడించాడు. ఈ కారు ఖరీదు రూ.30-40 లక్షల ఉంటుంది. ఇతడితో పాటు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కి కూడా ఇదే మోడల్ కారు ఇచ్చాడు. ఆ విషయాన్ని సాయి తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. చూస్తుంటే సూర్య.. టీమ్ అందరికీ ఒకేలాంటి కార్లు గిఫ్ట్స్ ఇస్తున్నట్లున్నాడు.

(ఇదీ చదవండి: 'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement