'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్ | Naga Chaitanya Special Birthday Wishes To His Wife Sobitha Dhulipala, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: 'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్

May 31 2026 12:00 PM | Updated on May 31 2026 2:52 PM

Naga Chaitanya Special Wishes To His Wife Sobitha Dhulipala

టాలీవుడ్ హీరో నాగచైతన్య తన సతీమణి శోభితకు స్పెషల్ విషెల్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్‌ డే కావడంతో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. తనతో ఉన్న మధురమైన క్షణాలను ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. హ్యాపీ బర్త్‌ డే మై లేడీ శోభిత.. నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం దొరికినందుకు చాలా కృతజ్ఞుడిని  అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చైతూ ఫ్యాన్స్ సైతం శోభితకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాల 2024 డిసెంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరి పెళ్లి కోసం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగానే వేదికను ఏర్పాటు చేశారు. హీరో వెంకటేశ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ తారలు పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement