'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు | Director H Vinoth Breaks Silence On Vijay Jana Nayagan Movie Release Date Delay, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Jana Nayagan H Vinoth: నిజాలు మాట్లాడే ధైర్యం నాకు లేదు

May 31 2026 3:55 PM | Updated on May 31 2026 5:53 PM

Director H Vinoth Reacts Jana Nayagan Movie Release Date

'జన నాయగణ్'.. ‍ఐదారు నెలల క్రితమే రావాల్సిన సినిమా కానీ ఇప్పటికీ రిలీజ్ కావట్లేదు. అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడి దీని విషయంలో అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్.. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో మూవీ విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అంతా అనుకున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసలేం జరుగుతుంది అని అంతా మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)

'జన నాయగణ్' సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి ఇది రీమేక్. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్‌కి మూవీ రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. సినిమా రిలీజ్ నా చేతుల్లో లేదు. ఈ మూవీకి సంబంధించిన నిజాలు మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా దానిని ప్రసారం చేసే ధైర్యం మీకు లేదు' అని అన్నాడు. ఈ మాటలు విని అంతా షాకవుతున్నారు.

ఎందుకంటే స్వయంగా డైరెక్టరే.. 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదని మాట్లాడటం కొత్త కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఏంటా నిజాలు? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈనెల 19నే మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ అయితే ఉంది గానీ ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. విజయ్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్. 

(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement