సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు | CM Vijay Son Jason Sanjay First Movie Sigma Release Date Announced, Check Out Poster Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

CM Vijay Jason Sanjay: కొడుకు తొలి సినిమా.. తండ్రి ఫ్యాన్స్ ఏం చేస్తారో?

May 29 2026 11:59 AM | Updated on May 29 2026 1:28 PM

CM Vijay Son Jason Sanjay First Movie Sigma Release Date

తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్ కొన్నిరోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవితంలోని విడాకుల వ్యవహారంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విజయ్ భార్య సంగీత ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే తన కూతురు, కొడుకుని తీసుకుని లండన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆమె చెన్నైలో లేరు.

(ఇదీ చదవండి: అక్కగా సీఎం విజయ్‌ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్‌)

మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. తండ్రిలా హీరో అవుతాడనుకుంటే ఊహించని విధంగా దర్శకుడిగా మారిపోయాడు. 'సిగ్మా' పేరుతో ఓ మూవీ తీస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ హీరో కాగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడో సర్‌ప్రైజ్ వచ్చేసింది. జూలై 31వ తేదీన థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

తండ్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్' రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇంతలోనే కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా' మాత్రం విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. మరి తండ్రి నుంచి దూరంగా ఉంటున్న జేసన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి విజయ్ అభిమానులు ఏ మేరకు సపోర్ట్ చేస్తారో చూడాలి? అయిత 'జన నాయగణ్' కూడా వచ్చే నెలలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే నెల గ్యాప్‌లో తండ్రీకొడుకుల సినిమాలు వచ్చినట్లు అవుతుంది.

(ఇదీ చదవండి: ఖుష్బూ ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత)

Advertisement
 
Advertisement
Advertisement