ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత | Kushboo Daughter Anandita Enters Kollywood As Executive Producer With Tamil Film Double Occupancy, More Details Inside | Sakshi
Sakshi News home page

Kushboo Daughter: అమ్మాయిలని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసిన ఖుష్బూ

May 29 2026 11:14 AM | Updated on May 29 2026 12:28 PM

Kushboo Daughter Anandita Enters Kollywood

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, దర్శకుడు సుందర్.సిల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీళ్ల కుమార్తెలు గురించి మాత్రం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. ఇప్పుడు వీళ్లిద్దరినీ ఖుష్బూ.. ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసింది. చిన్న కుమార్తె ఇప్పటికే మలయాళ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా ఇప్పుడు పెద్ద కూతురు ఆనందిక నిర్మాతగా మారిపోయింది.

ఖుష్బూకి చెందిన అవ్నీ మూవీస్‌ సంస్థ, బెంజ్‌ మీడియా సంస్థతో కలిసి నిర్మించిన తమిళ మూవీ 'డబుల్‌ ఆక్యుపెన్సీ'. అశ్విన్‌ కందసామి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో సంతోష్‌, సంయుక్త విశ్వనాథ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదే సినిమాకు ఖుష్బూ వారసురాలు ఆనందిత నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. చైన్నెలో రెండు రోజుల క్రితం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలోనే ఖుష్బూ మాట్లాడుతూ.. ఇందులో నటించిన సంతోష్‌, నా కూతురు ఆనందిత.. స్కూల్ నుంచే ఫ్రెండ్స్. మొదట్లో వీరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. అలాంటిది వారిద్దరే ఈ మూవీ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆనందిత ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పరిచయం అవుతోంది. ఈతరం యువతకు మనం చెప్పాల్సిందేమీ లేదు. వారి నుంచే ఏమి నేర్చుకోవాలనేదే ఈ మూవీ స్టోరీ అని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: మీరు గర్వపడేలా చేస్తా.. భాగ్యశ్రీకి కమల్ ఆశీస్సులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement