ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్ | Shekhar Kapoor Cast Vaibhav Suryavanshi In Masoom Movie | Sakshi
Sakshi News home page

Vaibhav Suryavanshi: సూర్యవంశీలో నటుడిని చూసిన స్టార్ డైరెక్టర్

May 31 2026 8:28 PM | Updated on May 31 2026 8:30 PM

Shekhar Kapoor Cast Vaibhav Suryavanshi In Masoom Movie

ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్.. ప్రస్తుతం 'మసూమ్: ద న్యూ జనరేషన్' సినిమాని తీస్తున్నారు. 1983లో వచ్చిన 'మసూమ్'ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు కుటుంబ బంధాలు, ప్రేమ, గుర్తింపు తదితర అంశాలతో తీస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

అయితే వైభవ్ సూర్యవంశీ గురించి ట్వీట్ చేసిన శేఖర్ కపూర్.. 'సూర్యవంశీ ఇంత సంచలన క్రికెటర్ కాకపోయింటే 'మసూమ్'లో అతడికి నటింపజేసేవాడిని' అని చెప్పుకొచ్చారు. వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని.. మసూమ్ లాంటి భావోద్వేగ సినిమాకు వైభవ్ సరిపోతాడని అభిప్రాయపడ్డారు.

బిహార్‌కి చెందిన సూర్యవంశీ వయసు 15 ఏ‍ళ్లే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టేసిన ఇతడు.. చిన్న వయసులోనే ఐపీఎల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డ్ సృష్టించాడు. భారత బ్యాటర్ల వరకు వేగవంతమైన ఐపీఎల్ శతకం చేసింది కూడా ఇతడే కావడం విశేషం. అలాంటి వైభవ్‌లో శేఖర్ కపూర్ లాంటి దర్శకుడు.. నటుడిని చూడటం ఆసక్తికరం.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్)

Advertisement
 
Advertisement
Advertisement