breaking news
KD: The Devil
-
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రామ్ చరణ్ 'పెద్ది' రాబోతుంది. గురువారం రిలీజ్ కానుండగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్ల పడనున్నాయి. మృణాల్, పూజా హెగ్డే నటించిన హిందీ మూవీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఈ వీకెండే రానుంది. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'ధురంధర్ 2' స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంది. దీనితో పాటు పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక తదితర తెలుగు డబ్బింగ్ మూవీస్ చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మేడిన్ ఇండియా, ద పిరమిడ్ స్కీమ్, బ్రౌన్ లాంటి సిరీసులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీకి ఏ మూవీ రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (జూన్ 01 నుంచి 07 వరకు)హాట్స్టార్ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04అమెజాన్ ప్రైమ్మేడిన్ ఇండియా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 03క్లార్క్సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05నెట్ఫ్లిక్స్మా బెహన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04ద మర్డర్ ఆఫ్ రేచల్ నికల్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 0429 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జీ5పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్గులక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆపిల్ టీవీ ప్లస్కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్) -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా.. కన్నడలో కాస్త గుర్తింపు ఉన్న హీరోనే. కానీ సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు. ఇతడు హీరోగా నటించిన ఓ సినిమా అష్టకష్టాలు పడి కొన్నిరోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'కేడీ ద డెవిల్'. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితమే మొదలైనప్పటికీ నెల క్రితం అంటే ఏప్రిల్ 30న కన్నడ వరకు రిలీజైంది. ఈ నెల 15న తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. కొన్నాళ్ల ముందు బూతు పాటతో వివాదంలోనూ ఇరుక్కుందీ మూవీ. బిగ్ స్క్రీన్‌పై ఏ మాత్రం మెప్పించలేకపోయింది. వచ్చే శుక్రవారం(జూన్ 05) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇప్పుడు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కేడీ ద డెవిల్' విషయానికొస్తే.. అది 1980ల కాలం. ధర్మ(రమేశ్ అరవింద్) ఓ ఉపాధ్యాయుడు. కానీ ఇతడు తమ్ముడు కాళి(ధ్రువ సర్జా) మాత్రం వీధిలో కిరోసిన్ అమ్ముతూ బతుకుతుంటాడు. కుస్తీలో తిరుగులేని యోధుడైన దేవా(సంజయ్ దత్) అంటే కాళికి ప్రాణం. 25 ఏళ్లుగా ముఠాని నడుపుతున్న దేవా.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. మరోవైపు ధర్మ స్నేహితుడు అణ్ణయ్యప్ప ఇదే ఎన్నికల బరిలో నిలుస్తాడు. దీంతో దేవా గ్యాంగ్.. కాళి, అతడి కుటుంబాన్ని చంపేయాలని చూస్తుంది. అప్పటివరకు ఆరాధించిన దేవాపై కాళి ఎలా తిరగబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)


