ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Kenatha Kanom Movie OTT Streaming Update Latest | Sakshi
Sakshi News home page

Kenatha Kanom OTT: 3 నెలల తర్వాత ఓటీటీలోకి హిట్ మూవీ

Jun 1 2026 6:37 PM | Updated on Jun 1 2026 6:54 PM

Kenatha Kanom Movie OTT Streaming Update Latest

తమిళ స్టార్ కమెడియన్లలో యోగిబాబు ఒకడు. సహాయ పాత్రలతో పాటు అప్పుడప్పుడు హీరోగానూ పలు సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిన 'మండేలా'ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

యోగిబాబు హీరోగా నటించిన తమిళ కామెడీ డ్రామా మూవీ 'కేనాథ కానం'. ఈ పేరుకు తెలుగులో 'బావి కనబడట్లేదు' అని అర్థం. తమిళనాడులోని చాలా పల్లెటూళ్లలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. తాగేందుకు సరైన నీటి సదుపాయం ఉండదు. అదే అంశాన్ని తీసుకుని ఈ మూవీ తీశారు. కాకపోతే సీరియస్ సమస్యని ఫన్నీగా చూపిస్తూ ఆలోచన రేకెత్తించారు. మార్చి 13న థియేటర్లలో రిలీజై హిట్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈనెల 15వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'కేనాథ కానం' విషయానికొస్తే.. కొడంగిపట్టి అనే ఊరిలో చాలా తక్కువ ఇళ్లు ఉంటాయి. కానీ ప్రతి ఇంటికి తాగునీటి సమస్య ఉంటుంది. దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా సరే ఏం చేయదు. ఈ ఊరిలో నీరు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ప్రజలు.. ఓ తాతని అడిగి ఆ ఊరి శిల్పి అయిన మణివాసగం(యోగిబాబు) ఇంటి దగ్గర ఉందని తెలుసుకుంటారు. దీంతో ఇతడు తన స్థలాన్ని దానం చేస్తాడు. ఊరంతా కలిసి అక్కడ నీటి కోసం తవ్వడం మొదలుపెడతారు. కానీ అక్కడ నీరు పడకపోగా డైనోసర్ ఎముకలు కనబడతాయి. దానికోసం కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారులు ఈ ఊరికి ఎందుకొచ్చారు? చివరకు నీటి సమస్య తీరిందా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement