ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Dridam Movie OTT Streaming Details Latest | Sakshi
Sakshi News home page

Dridam OTT: పోలీస్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై ప్రకటన

Jun 1 2026 5:17 PM | Updated on Jun 1 2026 5:19 PM

Dridam Movie OTT Streaming Details Latest

ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన మూవీస్ కూడా మన దగ్గర బాగానే ఆదరణ తెచ్చుకుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'దృశ్యం' చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ద్రిదమ్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. కానీ ఓ మాదిరి స్పందన మాత్రమే సొంతం చేసుకుంది. యంగ్ హీరో షేన్ నిగమ్ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది.

'ద్రిదమ్' విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్‌మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement