breaking news
Shane Nigam
-
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. రిలీజైన 8 నెలలకు..!
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యాక్షన్ మూవీ బాల్టీ . తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశఆరు. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. గతేడాది అక్టోబర్ 10న టాలీవుడ్లో రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.ఈ మూవీ విడుదలైన దాదాపు ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ సినిమా కోసం మలయాళ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జూలై 10 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన 8 నెలల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించనుంది బాల్టీ. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. -
ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీల్లో అదరగొట్టేస్తుంటాయి. తాజాగా మరో మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ధృడం'. ఈ మూవీ జూన్ 12 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో యంగ్ హీరో షేన్ నిగమ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన మూవీస్ కూడా మన దగ్గర బాగానే ఆదరణ తెచ్చుకుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'దృశ్యం' చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ద్రిదమ్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. కానీ ఓ మాదిరి స్పందన మాత్రమే సొంతం చేసుకుంది. యంగ్ హీరో షేన్ నిగమ్ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది.'ద్రిదమ్' విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ)


