షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యాక్షన్ మూవీ బాల్టీ . తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశఆరు. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. గతేడాది అక్టోబర్ 10న టాలీవుడ్‌లో రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.
ఈ మూవీ విడుదలైన దాదాపు ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ సినిమా కోసం మలయాళ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జూలై 10 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన 8 నెలల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించనుంది బాల్టీ. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు.


