బాలీవుడ్ నటి, మోడల్ అనుష్క రంజన్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. త్వరలో అమ్మ కాబోతున్న ఈ నటి ఐవీఎఫ్ అంటే ఆషామాషి కాదని అంటోంది. ఆ ప్రక్రియని మానసిక, శారీరక బాధల్ని అనుభవించే భయానక స్థితిగా పేర్కోంది. నిజానికి పిల్లలు లేరంటే ఐవీఎఫ్ అని నోటితో చెప్పినంత ఈజీకాదు ఫేస్ చేయడం అని అంటోంది. చాలా ఏళ్లుగా ఇది పూర్తిగా తెలియని నిషిద్ధ అంశంగా ఉండిపోయింది. అసలు ఇదేంటి, ఎలా చేస్తారు అనేదానిపై అందరకీ అవగాహన ఉండాలంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుందామె.
నటి అనుష్కరంజన్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తన భర్త ఆదిత్య సీల్‌తో కలిసి కుటుంబ జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న ఆమె తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సవివరంగా వెల్లడించింంది. ఐవీఎఫ్ జర్నీ అంత సులభం కాదని అంటోంది. ఈ పద్ధతిలో తీసుకునే ఇంజెక్షన్లు, మందుల సంఖ్య ఒక మహిళకు మాటలు కాదు అని అన్నారు. ఒకవేళ ఆ స్త్రీకి కుటుంబ ఒత్తిడి తోపాటు భావోద్వేగ ఒత్తిడి కూడా తోడైతే ఈ ప్రక్రియ మరింత సవాలుగా మారుతుందని అంటున్నారు. అయితే ఆ విషయంలో తన కుటుంబానికి చాలా రుణపడి ఉంటానని అంది.
ఎందుకంటే వాళ్లంతా తనకు ఈ జర్నీలో ఎంతో అండగా నిలిచారని చెప్పారామె. తాను తన భర్త 2023-24 నుంచి సంతానం గురించి ఆలోచించడం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన సోదరి సలహా మేరకు వైద్యులను సంప్రదించగా.. పరీక్ష ఫలితాలన్ని సరిగ్గా వచ్చినప్పటికీ..తాము సహజంగా గర్భం దాల్చలేమని తేల్చి చెప్పారు. తదుపరి చర్యగా ఐవీఎఫ్(IVF) వైపుకి వెళ్లమని సూచించారు.
ఐవీఎఫ్ అంటే మీ శరీరంలో ఏదో లోపం ఉందని కాదు. ఇది కేవలం శరీరానికి శరీరం, జీవితానికి జీవితం, వ్యక్తికి వ్యక్తి మధ్య జరిగే ప్రక్రియ అని అంటోందామె. అంతేగాదు అందుకోసం తాను దగ్గర దగ్గర సుమారు 150కి పైగా ఇంజెక్షన్లు తీసుకుని ఉంటానని అన్నారామె. వాటిలో ఒక ఇంజెక్షన్ ఎంత చిక్కగా ఉందంటే..అది ఇస్తున్నప్పుడల్లా నొప్పితే ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చారామె.
అంతేగాదు ఈ ప్రక్రియ తర్వాత మహిళల దృఢసంకల్పం పట్ల అపారమైన గౌరవం కలిగిందని చెబుతోంది. అంతేగాదు ఐవీఎఫ్ అప్రోచ్ అవుతున్న ప్రతి మహిళ ఆ ప్రక్రియలో ఎదురయ్యే ప్రతిదానికి సిద్ధంగా ఉండేలా శక్తిమంతంగా ఉండాలంటూ తన పోస్ట్‌ని ముగించిందామె.
(చదవండి: ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..)


