ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌.. ట్రైలర్ రిలీజ్ | Jeethu Joseph Malayalam Movie Dridam Trailer out now | Sakshi
Sakshi News home page

Dridam Trailer: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌.. ట్రైలర్ రిలీజ్

Jun 3 2026 9:22 PM | Updated on Jun 3 2026 9:23 PM

Jeethu Joseph Malayalam Movie Dridam Trailer out now

ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీల్లో అదరగొట్టేస్తుంటాయి. తాజాగా మరో మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ధృడం'.  ఈ మూవీ జూన్ 12 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో యంగ్ హీరో షేన్ నిగమ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్‌మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement